వైసీపీ కీలక నేత గుమ్మనూరు జయరాం మంగళవారం మంగళగిరిలో టీడీపీ – జనసేన కూటమి ఏర్పాటు చేసిన జయహో బీసీ సభ లో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకంటే ముందే వైసీపీ పార్టీ కి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనీ గవర్నర్ ను కోరగా, గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో జయరాం మాజీ మంత్రి అయ్యారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ జయరాంను అడగడంతో ఆయన ససేమిరీ అన్నారు.
దీంతో ఆయన పార్టీ మారేందుకు నిర్నయిన్చుకొని వైసీపీ కి రాజీనామా చేసి, టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారని, గుడిలో శిల్పం మాదిరిగా జగన్ తయారయ్యారని గమ్మనూరు జయరాం ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి చెప్పిందే జగన్ చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం జగన్ విధానాలపై విసుగుచెందానని గుమ్మనూరు విమర్శలు చేశారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ కోరారని, అది తనకు ఇష్టం లేదన్నారు. టిడిపి తరఫున గుంతకల్లు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని జగన్ తనను కోరారని, కానీ ఆ ప్రతిపాదన తనకు నచ్చలేదని పేర్కొంటూ రానున్న ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గుంతకల్లు నుంచి పోటీ చేస్తానని గుమ్మనూరు జయరాం చెప్పారు.