బిఆర్ఎస్ పార్టీ వరంగల్లు లోక్‌సభ నియోజకవ ర్గం అభ్యర్ధి అయిన డాక్టర్ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో దిగబోతున్నారని తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి హా మీ రావడంతోనే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా గురువారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. పోటీలో నుంచి తప్పుకోవడానికి దారితీసిన పరిస్థితులు, పరిణామాలను కూలంకషంగా వివరిస్తూ కారు పార్టీ అధినేత, మాజీ సి ఎం కెసిఆర్‌కు రాసిన లేఖను కూడా ఆమె మీడియాకు విడుదల చేశారు.
ఆమె తండ్రి మాజీ మంత్రి కడియం శ్రీహరి పేరును కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్‌గా పరిశీలిస్తోందని కొందరు నాయకులు వివరించారు. ఎందుకంటే కడియం శ్రీహరి అపారమై న రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కావడమే కాకుండా, ఎలాంటి వివాదాలు, ఆరోపణలు లేకపోవడం, అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా సుపరిచితుడు కావడం వంటి సానుకూలమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చా లా సీరియస్‌గా పరిశీలిస్తోందని వివరించారు.
ప్రస్తుతం కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారని, ఒకవేళ వరంగల్లుగా ఎంపీగా పోటీలో నిలిపి లోక్‌సభకు పంపిస్తే ఆయన కుమార్తె అయిన డాక్టర్ కడియం కావ్యను స్టేష న్ ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలోకి దిం పేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సీరియస్‌గా అధ్యయనం చేస్తోందని ఆ నాయకులు వివరించారు.
షెడ్యూల్డు కులానికి చెందిన డాక్టర్ కడియం కావ్య విద్యాధికురాలు కావడం, మాజీ మంత్రి, ఆపార రాజకీయ అనుభవం ఉన్న కడియం శ్రీహరి కుమార్తె కావడం ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడమే కాకుండా కడియం కుటుంబసభ్యులు ఎల్లప్పుడూ ప్రజలతోనే మమేకమైన ఉండటం వంటి అనేక సానుకూలాంశాలు ఉండటంతోనే కాంగ్రెస్ పెద్దలు కూడా డాక్టర్ కడియం కావ్య అభ్యర్ధిత్వానికి ఆమోదముద్ర వేశారని ఆ నాయకులు వివరించారు.
అందుకే బుధవారం న్యూఢిల్లీలో జరిగిన సిఈసి సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చిందని, అందుకే వరంగల్లు లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్ధిని ఖరారు చేయకుండా చివరి నిమిషంలో వాయిదా వేసినట్లుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
