సుదూర లక్షాల్యను సైతం అవలీలగా ఛేదించగల బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఒడిషాలోని చండీపూర్ తీరంలోని ఇంటిగ్రేటడ్ టెస్ట్ రేంజ్ నుంచి గురువారం ఉదయం నిర్వహించిన పరీక్ష విజయవంతమైనట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డిఒ) ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంతకుముందు రూపొందించిన వాటిి కన్నా ఇది సాంకేతికపరంగాను, పరిధి విస్తరణపరంగాను ఎంతో మెరుగైనది. సూపర్సానిక్ వేగంతో క్షిపణి దూసుకెళ్లిందని, మిషన్ లక్ష్యాలు నెరవేరాయని డిఆర్డిఓ తెలిపింది. రష్యాకు చెందిన ఎన్పిఒఎం, డిఆర్డిఒకు చెందిన బ్రహ్మోస్ ఎయిరోస్సేన్ సంయుక్తంగా ఈ క్షిపణిని తయారు చేశాయి.
2001లో తొలిసారిగా బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు. అప్పటి నుంచి దీనికి మెరుగులు దిద్దుకుంటూ వస్తున్నారు.ఇంతకు ముందు 450కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణి సామర్ధ్యాన్ని 600కి.మీ కు పెంచారు.
భూ ఉపరితలం నుంచి సముద్రంలోని లక్ష్యాలను, గగన తలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణి చాలా కాలం క్రితమే సాయుధ బలగాల అమ్ములపొదిలో చేరింది.