థియేటర్స్ మూతపడిన షాక్ నుంచి తేరుకొనేలోపే టాలీవుడ్ హీరోలకు మరో ఊహించని షాక్ తగిలింది. తెలంగాణ వ్యాప్తంగా బెన్ఫిట్ షోలు రద్దుకానున్నట్లు తెలుస్తోంది. నైజాంకి చెందిన ఎగ్జిబిటర్లు ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. పర్సంటేజ్ విషయంలో తమ డిమాండ్లు నెరవేరే వరకు తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
మల్టీప్లెక్స్ తరహాలో తమకు కూడా పర్సంటేజ్ ఇవ్వాలని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తూన్నారు. అయితే ఈ డిమాండ్‌ను నిర్మాతల మండలి పట్టించుకొనక పోవడంతో బెన్ఫిట్ షో రద్దు చేయలానే నిర్ణయానికి వచ్చారు ఎగ్జిబిటర్లు. దీనికి జూన్ 01వ తేదీ వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు.
అయితే కల్కి, పుష్ప 2, గేమ్ చేంజర్, భారతీయుడు లాంటి సినిమాలకు మాత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తామని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు పేర్కొన్నట్లు తెలుస్తుంది. కాగా.. దీనిపై తెలుగు నిర్మాతల మండలి స్పందిచాల్సి ఉంది.
తెలంగాణలో ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు మూతపడ్డాయి. గత కొన్ని నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమాలేవి విడుదల లేకపోవడం, ఓ పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండటంతో స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లపై పడింది.
ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకులు రాకపోవడంతో థియేటర్స్ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నష్టాలను పూడ్చడానికి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఓ నిర్ణయానికి వచ్చాయి. సమ్మర్ అయిపోయే వరకు ఓ రెండు వారాల పాటు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
మరోవైపు బెన్ఫిట్ షోలు రద్దు చేయడం వలన స్టార్ హీరోలకు పెద్ద దెబ్బపడుతుందని సమాచారం. బెనిఫిట్ షోలు లేకపోతే… సినిమా బృందానికి తీవ్ర నష్టమే కాకుండా… సినిమాపై హైప్ కూడా తగ్గిపోతుందని.. సినిమా ఫస్ట్ టాక్ వచ్చేదే బెనిఫిట్ షో వలన అని.. దానినే రద్దు చేస్తే ప్రేక్షకులలో సినిమాలపై ఆసక్తి తగ్గుతుందని నిర్మాతల మండలి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.