టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. లోయెస్ట్ స్కోర్‌ను కాపాడుకోగలిగింది. ఈ టోర్నమెంట్లో టీమిండియాకు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఓడించింది భారత్. ఈ రెండింట్లో కూడా బౌలర్లే హీరోలు. ఈ నెల 12వ తేదీన తన తదుపరి మ్యాచ్‌లో యునైటెడ్ స్టేట్స్ను ఎదుర్కొనబోతోంది రోహిత్ సేన.
గ్రూప్ ఏలో భాగంగా న్యూయార్క్‌లోని నస్సౌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత్. పాకిస్తాన్ బౌలర్లు రెచ్చిపోయారు. 19 ఓవర్లల్లో 119 పరుగులకే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్ చేసిన అత్యల్ప స్కోరు ఇదే.
టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసిన రిషభ్ పంత్ ఒక్కడే 42 పరుగులతో టాప్ స్కోరర్. రోహిత్ శర్మ- 13, విరాట్ కోహ్లీ- 4, అక్షర్ పటేల్- 20, సూర్యకుమార్ యాదవ్- 7, శివందుబే- 3, హార్దిక్ పాండ్యా- 7, రవీంద్ర జడేజా- 0, అర్ష్‌దీప్ సింగ్- 9, జస్ప్రీత్ బుమ్రా- 0, మహ్మద్ సిరాజ్- 7 (నాటౌట్) పరుగులు చేశారు.
నిర్ణీత 19 ఓవర్లల్లో టీమిండియా 119 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లల్లో షహీన్ షా అఫ్రిది- 1, నసీం షా- 3, మహ్మద్ అమీర్- 2, హ్యారిస్ రవూఫ్- 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఛేజింగ్‌లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా బౌలర్ల విజృంభణ ముందు ఏ ఒక్కరూ క్రీజ్‌లో కుదురుకోలేకపోయారు. పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు సహకరిస్తోండటంతో చెలరేగిపోయారు. నిప్పుకణికల్లాంటి బంతులను సంధించారు.
ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఒక్కడే టాప్ స్కోరర్. 44 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 31 పరుగులు చేశాడు రిజ్వాన్. బాబర్ ఆజమ్- 13, ఉస్మాన్ ఖాన్- 13, ఫకర్ జమాన్- 13, ఇమద్ వసీం- 15, షాదబ్ ఖాన్- 4, ఇఫ్తికర్ అహ్మద్- 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. నసీం షా- 10, షహీన్ షా అఫ్రిది- 0 పరుగులతో చివరి వరకు క్రీజ్‌లో నిలవగలిగారు.
ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచారు బౌలర్లు. ప్రత్యేకించి జస్ప్రీత్ బుమ్రా. తన నాలుగు ఓవర్ల కోటాలో 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, ఇఫ్తికర్ అహ్మద్.. వికెట్లు అతని ఖాతాలో పడ్డాయి. హార్దిక్ పాండ్యా- 2, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.