టిడిపి నేత బుద్దా వెంకన్నను విజయవాడలో ఆయన ఇంటికి వద్ద పోలీసులు అరెస్టు చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై బుద్దా వెంకన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసిపి నేతల ఫిర్యాదు మేరకు వెంకన్నను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే పోలీస్ స్టేషన్ లో విచారణ జరిపి రాత్రి 11.15 గంటల ప్రాంతంలో విడుదల చేశారు. బుద్ధా వెంకన్న అరెస్టుకు ముందు.. నిన్న ఉదయం మంత్రి కొడాలి నాని, రాష్ట్ర డీజీపీలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి కొడాలి నానికి సంబంధించిన కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించినట్టు సాక్ష్యాధారాలున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.
డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీ అని ఆరోపించారు. కొడాలి నానికి రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు అని, అలాంటి వారికి టికెట్లు ఇవ్వడం చంద్రబాబు తప్పని విమర్శించారు. నాని గత చరిత్ర గురించి అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గారావు ఫిర్యాదు మేరకు బుద్ధా వెంకన్నపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు మధ్యాహ్నం 2 గంటల సమయంలో బుద్దా వెంకన్నను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ముందస్తు నోటీసు లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు మూడు గంటలపాటు పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య చర్చల అనంతరం భారీ బందోబస్తు మధ్య వెంకన్నను పోలీస్ స్టేషన్కు తరలించారు. రాత్రి వరకు విచారించిన పోలీసులు అనంతరం విడిచిపెట్టారు.
సంస్కారం లేకుండా చంద్రబాబును తిడుతుంటే చోద్యం చూస్తారా?.. కొడాలి నానిని ఎందుకు అరెస్టు చేయలేదో.. డీజీపీ సమాధానం చెప్పాలని అంతకు ముందు బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది.
తన వ్యాఖ్యలు చట్టవిరుద్ధమైతే కొడాలి నాని చేసినవి చట్టబద్ధమా? అని బుద్దా ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని గత కొంతకాలంగా అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలడి – బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో టిడిపి అధినేత అధినేత చంద్రబాబు ఇంటివైపు వస్తే కొడాలి నానిని చంపడానికైనా తాను చావడానికైనా సిద్ధమని బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై బుద్దాను ప్రశ్నించేందుకు పోలీసులు ఆయన నివాసానికి భారీగా వచ్చి ఉద్రిక్తత పరిస్థితుల మధ్య అరెస్ట్ చేశారు.
·