ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం పాలసీ కేసులో కోర్టు ఆయనకు బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మధ్యంత స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థాన్నా ఆశ్రయించారు. కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు సోమవారం ఈ అంశంపై విచారణ కోరుతామని తెలిపారు.
కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రయల్ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్‌కు రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్‌ను మంజూరు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈ కేసులో ప్రత్యక్ష సాక్ష్యాలను చూపడంలో ఈడీ విఫలమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
దీంతో ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ ఆర్డర్‌పై స్టే విధించాలని కోరగా.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు బెయిల్‌పై మధ్యంతర స్టే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
2021-22 సంబంధించిన మద్యం పాలసీ కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది.
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత జూన్ 2న తిరిగి కోర్టులో లొంగిపోయారు. వైద్యపరమైన కారణాలతో ఏడువారాల పాటు మధ్యంతర బెయిల్‌ను కోరగా.. జూన్ 5న ట్రయల్ కోర్టు తిరస్కరించింది. తాజాగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు అనుమతి ఇచ్చింది. ఈడీ హైకోర్టును ఆశ్రయించగా స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.