ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను డ్రగ్స్ సేవిస్తుండగా హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ అమన్ ప్రీత్ సింగ్‌కు టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్దారణ అయిందని పేర్కొన్నారు. ఈ కేసులో అమన్ ప్రీత్ సింగ్‌ను వినియోగదారుడిగానే విచారిస్తున్నామని తెలిపారు.
డ్రగ్స్‌కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని, పరారీలో మరో ఇద్దరున్నారని చెప్పారు. పరారీలో ఉన్నవారిలో కీలక సూత్రధారి నైజీరియన్ అని తెలిపారు. డ్రగ్స్ వ్యాపారంలో ఓనౌహది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఓనౌహ నైజీరియా నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. డ్రగ్స్ సరఫరాలో ఓ కొరియోగ్రఫర్ కూడా ఉన్నారు.
డ్రగ్స్ తీసుకుంటున్న ఐదుగురి నుంచి శాంపిల్స్ తీసుకున్నాం. 2 పాస్‌పోర్టులు, 10 సెల్ఫోన్లు, 2 బైకులు సీజ్ చేశామని సీపీ శ్రీనివాస్ చెప్పారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో యాక్టివ్‌గా ఉందని.. డ్రగ్ పెడ్లర్లకు సంబంధించిన సమాచారం అందిస్తే.. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
డ్రగ్స్ ఫ్రీ సిటీ కోసం ప్రజలు సహకరించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన గ్యాంగ్‌ను తనిఖీ చేయగా.. రూ.2 కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ లభ్యమైంది.
