కేరళలోని వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్రసీమ సైతం మేం ఉన్నామంటూ అండగా నిలబడుతోంది. ఇందులో భాగంగా చిరంజీవి మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. ఇప్పుడు కేరళలోనివయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
కేరళ ప్రభుత్వానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ మద్దతు తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ కలిసి వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ‘వయనాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అంటూ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా సానుభూతిని ప్రకటించారు.
హీరో అల్లు అర్జున్ కూడా నేను సైతం.. అంటూ తన మంచి మనసుని మరోసారి చాటుకున్నారు. వయనాడ్ బాధితులకు తన వంతుగా రూ.25 లక్షలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే కమల్‌హాసన్ రూ.25 లక్షలు, విక్రమ్ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షలు, హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సూర్య సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార, విఘుేశ్ శివన్ దంపతులు రూ.20 లక్షలు, మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్సల్మాన్ రూ.35 లక్షలు, పహాద్ ఫాజిల్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.
తాను వ్యవస్థాపకుడిగా ఉను విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రూ.3 కోట్ల విరాళం ఇవ్వడమే కాకుండా స్వయంగా సహాయక చర్యల్లో పాల్గంటూ మోహన్‌లాల్ అందరికీ ఆదర్శంగా నిలుస్తునాురు. టాలీవుడ్ ప్రతిష్టాత్మక సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తరఫున నిర్మాత సూర్యదేవర నాగవంశీ రూ.5 లక్షల విరాళాన్ని అందించారు.