తన దగ్గరకు వైద్యానికి వచ్చిన మహిళలు, చిన్నారులను స్పృహ లేని సమయం చూసి అభ్యంతరకర దృశ్యాలను రికార్డు చేసేవాడు.గత కొన్నేళ్లుగా తాను పనిచేస్తున్న ఆసుపత్రుల్లో రహస్య కెమెరాలతో వీడియోలను చిత్రీకరించాడు. ఎట్టకేలకు భార్య ఫిర్యాదుతో అతడి అరాచకాలు వెలుగులోకి రావడంతో ఇటీవల ఆక్లాండ్ కౌంటీ పోలీసులు ఓ భారతీయ వైద్యుడిని అమెరికాలో అరెస్టు చేశారు.
భారత్‌కు చెందిన ఒయిమెయిర్ ఎజాజ్ 2011లో వర్క్ వీసాపై అమెరికాకు వెళ్లాడు. తొలుత కొన్నేళ్ల పాటు అలబామాలో నివాసమున్న అతడు 2018లో మిషిగాన్‌కు మకాం మార్చాడు. ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే, గత కొన్నేళ్లుగా అతడు లైంగిక దారుణాలకు పాల్పడ్డాడు.
తాను పనిచేసే చోట ఆసుపత్రి గదులు, బాత్రూమ్లు, చేజింగ్ ఏరియా వంటి ప్రదేశాల్లో రహస్యంగా కెమెరాలు పెట్టి అనేక మంది మహిళలు, చిన్నారుల నగ్న వీడియోలను రికార్డ్ చేశాడు. బాత్రూమ్లు, ఛేంజింగ్ ఏరియాలు, హాస్పిటల్ రూమ్‌లు, ఇంట్లోనూ రహస్య ప్రదేశాల్లో కెమెరాలు పెట్టి.. దుస్తుల్ని మార్చుకునే చిత్రాలను తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అతని భార్య కొన్ని అభ్యంతరకర ఫోటోలు, వీడియోలను పోలీసులకు అప్పగించిన తర్వాత అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. స్పృహలోలేని, నిద్రలో ఉన్న ఆడవారితో సెక్స్ చేసిన సందర్భాలను కూడా వీడియో రికార్డు చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి.
మిచిగన్ రాష్ట్రంలోని ఓక్లాండ్ కౌంటీలో ఉన్న రోచెస్టర్ హిల్స్ ఇంటిలో వేల సంఖ్యలో వీడియోలు గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. అయిజాజ్ ఇంట్లో సెర్చ్ చేసిన పోలీసులు .. అక్కడి నుంచి కంప్యూటర్లు, ఫోన్లు, 15 ఎక్స్టర్నల్ డివైస్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఓ హార్డ్ డ్రైవ్‌లో సుమారు 13వేల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. క్లౌడ్ స్టోరేజ్‌లోకి కూడా ఆ వీడియోలను అప్లోడ్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.