స్నేహితుల హోటల్ ప్రమోషన్ కోసం తలకు `గణపతి బొప్పా మోరియా’ అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి, మధ్యం సేవించినట్లు ఓ వీడియోలో నటించిన బిగ్ బాస్ ద్వారా పేరొందిన సరయతో పాటు, ఆమె బృందంలోని వారిని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆమె ఆ విధంగా నటించడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బకొట్టారని,, మత విద్వేషాలు రెచ్చగొట్టెలా వ్యవహరించారని విశ్వహిందూ పరిషత్ నేత ఇచ్చిన ఫిర్యాదుతో ఈ అరెస్ట్ జరిగింది. ఆమె 7ఆర్ట్స్ పేరుతో వీడియోలు తీస్తున్నారు.
ఆమె స్నేహితులు గత ఏడాది సిరిసిల్లలో సెవెన్ ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఆ హోటల్ ప్రమోషన్లో భాగంగా సరయూ ఒక లఘు చిత్రాన్ని విడుదల చేయడంతో .రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషద్ అధ్యక్షుడు అశోక్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సరయుతో పాటు ఆమె వీడియో టీం సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, నటులు కార్తిక్, కృష్ణమోహన్‌లను కూడా అరెస్ట్ చేశారు.యూట్యూబ్‌లో ఆ వీడియో వైరల్ అవ్వగా నెటిజన్లు సోషల్ మీడియాలో దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను, మహిళలను కించపరిచేలా ఆ లఘుచిత్రం ఉందని విమర్శించారు.
కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన సిరిసిల్ల పోలీసులు, లఘు చిత్రాన్ని నిర్మిచింది బంజారాహిల్స్‌లో అని గుర్తించారు. దాంతో కేసును బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులు షార్ట్‌ఫిల్మ్ బృందంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలో సోమవారం సరయూతో పాటు.. షార్ట్‌ఫిల్మ్ బృందంలోని కృష్ణ మోహన్, శ్రీకాంత్ రెడ్డి, కార్తిక్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించి, సీఆర్పీసీలోని సెక్షన్- 41 కింద నోటీసులు ఇచ్చి పంపారు. బిగ్‌బాస్ సీజన్-5కి ఎంపికైన సరయూ మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యారు. వారిపై 153ఎ, 295ఎ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.