అట్టహాసంగా జరిగిన శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు త్రిదండి చినజీయర్ స్వామి, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుల మధ్య `కోల్డ్ వార్’కు దారితీసిన్నట్లు తెలుస్తున్నది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనధికారికంగా `ఆస్థాన గురువు’ స్థాయిలో స్వామిని గౌరవిస్తూ, ఆధ్యాత్మిక అంశాలు అన్నిటిలో ఆయన మాటలను అనుసరిస్తూ వస్తున్న కేసీఆర్ ఈ ఉత్సవాలలో పాల్గొనకపోవడం అందరికి విస్మయం కలిగిస్తున్నది.
కనీసం వేడుకల ముగింపు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హరాజయ్యేవిధంగా చేయడం కోసం చినజీయర్ స్వామితోపాటు మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదు. మొదటి నుండి అక్కడ సమతా మూర్తి రామానుజాచార్య విగ్రహం ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వం పక్షాన అన్నిరకాల సహకారం అందిస్తూ వచ్చారు.
చివరకు వేడుకల ఏర్పాట్లను సహితం మంత్రులు, ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షించారు. యాదాద్రి ఆలయ పునరుద్ధరణ దగ్గర నుండి భద్రాచలం ఆలయం కార్యక్రమాల వరకు అన్నింటా స్వామిజీ చెప్పిన్నట్లే చేస్తూ కేసీఆర్ పలు వర్గాల నుండి విమర్శలకు సహితం గురయ్యారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి వంటి జాతీయ నేతలు వస్తున్న కార్యక్రమంలో ఎటువంటి లోటుపాట్లు ఉండరాదని కేసీఆర్ స్వయంగా ముందురోజు అక్కడకు వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అయితే ఒకరిద్దరు తప్ప ఆయన మంత్రులు సహితం ఎవ్వరు వేడుకలలో పాల్గొనకపోవడం, ఆయన కుటుంభం సభ్యులు అందరు దూరంగా ఉండడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకు ప్రధానంగా రామానుజాచార్య భారీ విగ్రహావిష్కరణ శిలా ఫలకం మీద తన పేరు లేకపోవడంతో నిప్పులు చెరుగుతున్నట్లు తెలుస్తున్నది.
ముందురోజు సాయంత్రం వరకు కేసీఆర్ కూడా ప్రధాని కార్యక్రమాలలో పాల్గొంటున్నట్లు సంకేతం ఇస్తూ వచ్చారు. అయితే చివరిలో `జ్వరం’ కారణంగా రావడం లేదని తెలిపారు. శిలాఫలకం ముందే ఎప్పుడో తయారై ఉంటుందని, దానిపై తన పేరు లేకపోవడం అంటే ఎక్కడినుండో వచ్చిన వత్తిడుల కారణంగానే జరిగి ఉంటుందని కేసీఆర్ అనుమానిస్తున్నారు.
కేసీఆర్ సహకారం లేకుండా స్వామిజి అంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయగలిగేవారు కాదని, అలాటింది ఎటువంటి సహకారం అందించని వారికి ప్రాధాన్యత ఇచ్చి, వారిపై పొగడ్తల వర్షం కురిపించడంతో కేసీఆర్ తట్టుకోలేక పోతున్నారని చెబుతున్నారు.
ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం వలే కాకుండా `బిజెపి జాతర’ వలే నిర్వహించారని విమర్శలు ఇతర రాజకీయ పక్షాల నుండి కూడా వెలువడుతున్నాయి. స్వామి కేవలం బిజెపి, ఆర్ ఎస్ ఎస్ నేతలను స్వయంగా ఆహ్వానించి, ఇతర పక్షాలకు చెందినవారిని పట్టించుకోకపోవడం గమనార్హం.
జరిగిన పొరపాటును సవరించుకోవడానికా అన్నట్లుగా రాష్ట్రపతి ఆవిష్కరించిన రామానుజుల బంగారు విగ్రహం శీలా ఫలకం మీద కేసీఆర్ పేరు ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య ఏర్పడిన అఘాధం ఇప్పట్లో భర్తీ చేయడం సాధ్యం కాకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ముగింపు రోజు జరగాల్సిన శాంతికల్యాణాన్ని ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు చినజీయర్ స్వామి ప్రకటించడం సీఎం కేసీఆర్ కోసమేనంటూ ప్రచారం సాగుతోంది.
తాను ప్రధాని నరేంద్ర మోదీపై రాజకీయ విమర్శలు గుప్పిస్తున్న సమయంలో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి, తనను చులకన చేసే విధంగా జియ్యర్ స్వామి వ్యవహరించడంను కేసీఆర్ తమాయించుకోలేక పోతున్నట్లు చెబుతున్నారు. ఈ `కోల్డ్ వార్’ ఎటువైపు దారితీస్తుందో అనే ఆందోళనలు సహితం వ్యక్తం అవుతున్నాయి.
త్వరలో జరుగనున్న యాదాద్రి ఆలయ ప్రారంభిత్సవంకు ప్రధాని మోదీతో పాటు జియ్యర్ స్వామిని కూడా కేసీఆర్ దూరంగా ఉంచే అవకాశాలు ఉన్నట్లు ఈ సందర్భంగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదివరకే ప్రధానిని కేసీఆర్ స్వయంగా ఆహ్వానించడం గమనార్హం.
1 Comment
KCR has horribly lost his sense of proportion in many important aspects. Despite his boasts, he is feeling rattled & very insecure. That’s why he is desperately trying to cook alliances with a hotchpotch of parties. Unless he restrains his arrogance, know-all behaviour, and dynastic prominence, he’s sure to witness his own downfall sooner or later.