పన్నులతో పాటు వివిధ అంశాల్లో రాష్ట్రానికి నష్టం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంను సవరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విభజన వివాదాల పరిష్కార ఉపసంఘ మెదటి సమావేశం గురువారం జరిగింది.
కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ గురువారం ఢిల్లీ నుంచి ఎపి, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సంస్థల నిధుల వివాదం, ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ నిధుల పంపిణీ, పన్నులు, బ్యాంకుడిపాజిట్లు, సివిల్ సప్లైస్, తదితర అంశాలపై తొలి సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.
పునర్వ్యవస్థీకరణ చట్టంలో అనేక లోపాలున్నాయని, ఫలితంగా పన్నులతో పాటు అనేక అంశాల్లో రాష్ట్రం నష్టపోతోందని ఏపీ అధికారులు చెప్పారు. దీనిని నివారించేందుకు పునర్ వ్యవస్థ్కీరణ చట్టానిు సవరించాలనికోరారు. అయితే, ఈ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది.
చట్టం అమలులోకి వచ్చి ఏడునురేళ్లు దాటిపోయిందని, ఇప్పుడు చట్ట సవరణ అవసరంలేదని తెలిపింది. చట్ట సవరణ చేస్తే సమస్యలు పెరుగుతాయని, పరిష్కారమైన వివాదాలు మళ్లీ తలెత్తుతాయనితెలంగాణ అధికారులు తెలిపారు. చట్ట సవరణ సాధ్యం కాకపోతే తమకు జరుగుతున్న నష్టాలను కేంద్రం భర్తీ చేయాలని ఎపి అధికారులు కోరారు.
ఈ దశలో జోక్యం చేసుకున్న హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ చర్చను పనుుల అంశానికే పరిమితం చేయాలనికోరారు. చట్ట సవరణకు సంబంధించి స్థూలంగా ఆయన తెలంగాణ వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే బలపరిచినట్టు తెలిసింది.
తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ లిమిటెడ్‌కు రూ.354 కోట్ల బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పోరేషన్ బదిలీ అయ్యేలా అండర్‌టేకింగ్ ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
కాగా, వివాదాలకు సంబంధించి కోర్టు కేసులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంటే ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర విభజన తర్వాత అకస్మాత్తుగా తెలంగాణకు ఎపి జెన్కో విద్యుత్ సరఫరా నిలిపివేసిందని, ఆసమయంలో అధిక ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేశామని తెలంగాణ అధికారులు తెలిపారు.
వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటే టిఎస్ జెన్కోకు ఎపిజెన్కో రూ.12,532కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. బకాయిలు చెల్లించకుండా ఎపి ప్రభుత్వం హైకోర్టులో కేసు దాఖలు చేసిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ (ఎపిఎస్ఎఫ్సి) విభజన ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా కేంద్రానికి పంపిందని తెలంగాణ పేర్కొంది.
ఎపిఎస్ఎఫ్సికి 253 ఎకరాల భూ కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ హైకోర్టును ఆశ్రయించి ఎపి ప్రభుత్వం స్టేటస్ కో పొందిందని, నానక్‌రామ్ గూడలోని కార్పోరేషన్ ఆస్తుల పంపకాల్లో కూడా వివాదం నడుస్తోందని తెలంగాణ కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సిన బ్యాంకు డిపాజిట్లను వెంటనే చెల్లించాలని తెలంగాణ డిమాండ్ చేసింది.
కేంద్ర పథకాలకు సంబంధించి రూ.495.21కోట్లు రావాల్సిఉందని, హైకోర్టు, రాజ్‌భవన్, సాధారణ ఖర్చులకు సంబంధించి రూ.315కోట్లు, నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకురూ.464కోట్లు ఎపి ప్రభుత్వం చెల్లించాల్సిఉందని క్రెడిట్ క్యారీడ్ ఫార్వర్డ్ కింద రూ.208 కోట్ల బకాయిలు రావల్సి ఉందని అధికారులు వివరించారు.