జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అకస్మాత్తుగా సోమవారం రాత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకోవడం రాజకీయ వర్గాలలో ఆసక్తి కలిగిస్తున్నది.
వచ్చే సోమవారం నుండి అసెంబ్లీ బడ్జెట్రు సమావేశాలు ఉండగా, పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో ఢిల్లీ వెళ్లడం వెనుక ఎజెండా బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం వివిధ పార్టీల నేతలతో సమాలోచనలకే అనే అభిప్రాయం కలుగుతున్నది.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో రెండు రోజుల పాటు సుదీర్ఘంగా సమాలోచనలు జరిపిన మరుసటి రోజే ఆయన ఢిల్లీకి చేరుకోవడం గమనార్హం. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు, ఆయన నిర్ణయించిన అప్పాయింట్మెంట్ ల ప్రకారం కొందరు నేతలను కలిసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలను కలిసే అవకాశముందని టిఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మొదటగా సిఎం కెసిఆర్ కలుస్తారని తెలుస్తోంది.
ఈ మధ్యనే ముంబైకి వెళ్లి ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ లను కలసిన ఆయన మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ లతో టెలిఫోన్ లో మాట్లాడారు. రెండు నెలల క్రితం చెన్నైలో స్టాలిన్ ను వ్యక్తిగతంగా కూడా కలిశారు. అంతకు హైదరాబాద్‌కు వచ్చిన వామపక్షాలకు
ఢిల్లీ ఎయిమ్స్‌ను సందర్శించి అక్కడ కెసిఆర్ తన ఆరోగ్యానికి సంబంధించిన పలు పరకాల టెస్టులు కూడా చేయించుకోనున్నారని చెబుతున్నారు. సిఎం కెసిఆర్‌తో ఢిల్లీకి వెళ్లిన వారిలో ఆయన సతీమణి శోభ, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపి సంతోష్‌కుమార్, ఎంఎల్‌సి కవిత, అడిషనల్ డిజి అనిల్‌కుమార్, ఉన్నారు.
కేవలం దేశ రాజకీయాలపైనే కాకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంటులపై కూడా పలువురు కేంద్ర మంత్రులతో కెసిఆర్ సమావేశం కానున్నారని తెలుస్తోంది. అలాగే రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను కూడా మరోసారి ఆయన కేంద్రం దృష్టికి తీసుకవెళ్లే అవకాశముందని సమాచారం.
అయితే ప్రధాని నరేంద్రమోడీతో సిఎం కెసిఆర్ కలుస్తారా? లేదా? అన్న విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. డిసెంబర్ మొదటివారం ఢిల్లీలో చాలారోజులున్న ఆయన ప్రధానిని కలుస్తున్నట్లు మీడియాకు లీక్ ఇచ్చినా, అసలు ఆయన అప్పోయింట్మెంట్ కోరలేదని తర్వాత తెలిసింది. హైదరాబాద్ కు వచ్చిన ప్రధానికి కనీసం స్వాగతం కూడా పలకలేదు.