యూపీ ఎన్నికల చివరి దశ ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని రంగంలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది. మొదటి ఐదు దశల్లో చాలా వరకు గైర్హాజరైన ప్రధాని మోదీ, ఇప్పుడు పూర్వాంచల్‌లో పార్టీ గెలుపు కోసం తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని లోక్‌సభలో నిలబెట్టుకోవాలనే పట్టుదలను ఇది చూపుతోందా? లేక రాష్ట్ర నాయకత్వానికి ఏదైనా రహస్య సందేశం ఉందా?
2019 లోక్‌సభ ఎన్నికలలో, మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిని తన నామినేషన్ దాఖలు చేయడానికి మాత్రమే సందర్శించి రోడ్‌షో నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఆయన తిరిగి రాలేదు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత, వారణాసి నుండి రెండవసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత, నగర ప్రజలు తన ప్రచారాన్ని నడిపించారని, ఫలితాల వరకు దూరంగా ఉండాలని తనను ప్రత్యేకంగా కోరారని ప్రధాని చెప్పారు.
అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఆయన మూడు రోజులపాటు అక్కడ మకాం వేసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు? బహుశా గత ఏడెనిమిదేళ్లలో మరెక్కడా ప్రధాని ఎన్నికల ప్రచారం కోసం అన్ని రోజులు ఉండలేదు.
మొదటి ఐదు దశలు పట్టించుకోని ప్రధాని!
ఎన్నికల ప్రచారంలో ఎక్కువ భాగం, మొత్తం ఏడు దశల్లో మొదటి ఐదు దశల్లో, ప్రధాని దాదాపుగా గైర్హాజరయ్యారు. మొదటి దశలో బిజ్నోర్‌లో ప్రతిపాదించిన తన ప్రారంభ ర్యాలీని కూడా రద్దు చేసుకున్నారు. ముజఫర్‌నగర్, ఘజియాబాద్, నోయిడా, హాపూర్, మీరట్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభాల్, రాంపూర్, లఖింపూర్ ఖేరీ జిల్లాలతో సహా పార్టీ ఇబ్బందుల్లో ఉన్న చోట్ల ఆయన ప్రచారానికి రాలేదు.
ఐదవ దశ ముగిసే వరకు, మొత్తం ప్రచార బాధ్యతలను హోమ్ మంత్రి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వహిస్తూ, రాష్ట్రంలో విపక్షాల నుండి ఎదురయ్యే పోటీని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మొదటి ఐదు దశల్లో మొత్తం 403 సీట్లలో 292 ఓట్లు పోలయ్యాయి, ప్రఇప్పుడు ధాన మంత్రి బలప్రదర్శన జరపడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.
ఇది తన పార్టీని ఎలాగైనా గెలిపించుకోవాలనే ఆఖరి ప్రయత్నమా? తాను పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే తహతహలా? లేక తానే పార్టీని కాపాడగలిగెడిది అని చాటి చెప్పడం కోసమా?రక్షకుడని నిలదీయడానికా? ప్రతిపక్ష నాయకుల కధనం మేరకు ఇప్పటికే ఓడిపోయిన ఎన్నికల్లో కొన్ని గౌరవప్రదమైన సీట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు.
తొలి ఐదు దశల్లో పోలింగ్ జరిగిన 292 స్థానాలకు గాను తమ పార్టీ ఇప్పటికే 200 స్థానాలను కైవసం చేసుకున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. పలు సీట్లలో నెక్ టు నెక్ పోరాటాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ వాదన అతిశయోక్తి కావచ్చు. అయితే, బిజెపి పశ్చిమ యుపిని తన బలమైన కోటలో అంటే పూర్వాంచల్‌లోని నష్టాలను సమతుల్యం చేసుకోవాలనుకొనే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నట్లు భావించవలసి వస్తుంది.
2024 లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ ఎన్నికల యంత్రాంగంపై ప్రభావం చూపకుండా, అసెంబ్లీ ఎన్నికలతో ప్రధానికి ఎలాంటి సంబంధం లేదని సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? మరోవంక,, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను అప్రతిష్టపాలు చేయాలని ప్రధాని భావిస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
పార్టీ బలహీనంగా ఉన్న చోట ప్రచారం చేయకుండా, పార్టీ బలంగా ఉన్న వారణాసి, సమీప ప్రాంతాలలో విస్తృతంగా ప్రచారం చేయడం గమనార్హం. సహజంగానే, తన కంచుకోటలో పార్టీ మద్దతుదారులను, కార్యకర్తలను సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏడు అంచెల అసెంబ్లీ ఎన్నికల చివరి దశలో వారణాసి ఓట్లు.
మొత్తం మీద 2017 ఎన్నికలు కేవలం ప్రధాని మోదీ ప్రజాదరణ, ప్రతిష్ట ఆధారంగా బిజెపి ప్రచారం చేయగా, ఈ ఎన్నికలు మొత్తం యోగి ఆదిత్యనాథ్ ప్రజాదరణ, ప్రతిష్ట కేంద్రంగా బిజెపి ప్రచారం జరుపుతూ ఉండడం కనిపిస్తున్నది.
యోగి బిజెపిలో ఒంటరి అవుతున్నారా?
మరోవంక, ఈ ఎన్నికల ప్రచారంలో యోగి ఆదిత్యనాథ్ బీజేపీలో ఒంటరి అవుతున్నట్లు కనిపిస్తున్నది. ఆయన చేస్తున్న పలు వాఖ్యలు, పనులు వివాదాస్పదం అవుతూ ఉండగా, బిజెపి వర్గాలతో పాటు ఆర్ ఎస్ ఎస్ వర్గాలు సహితం అసహనంగా వ్యవహరిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. ఆయన వాడుతున్న భాష తమ సంస్థలకు ప్రయోజనం చేకూర్చక పోగా హాని కలిగిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆయన సాధారణ రాజకీయ వేత్త కాకపోవడం,కాషాయ వస్త్రాలు ధరించిన సాధువు కావడంతో ప్రజలు అయన హుందాగా మాట్లాడాలని ఆశిస్తారని, కానీ ఆయన కొన్ని సందర్భాలలో వాడుతున్న భాష దీర్ఘకాలంలో తనకు ఇబ్బందికరం కాగలదని భావిస్తున్నారు. ఉదాహరణకు ఆయన ప్రయోగిస్తున్న పదజాలం ఈ ఎన్నిక “80 శాతం – 20 శాతం” ప్రజల మధ్య జరుగుతున్నదని చెబుతున్నారు.
అంటే 80 శాతం హిందువులు, 20 శాతం ముస్లింలకు మధ్య జరుగుతున్న ఎన్నికలంటూ, మత ఉద్రిక్తలు, విబేధాలు సృష్టిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపితున్నాయి. కానీ ఆయన మాత్రం 2017లో, ఆ తర్వాత 2019లో బిజెపి 80 శాతం సీట్లు గెల్చుకున్నదని, మిగిలిన అన్ని పక్షాలు 20 శాతమే గెల్చుకున్నాయని చెబుతూ వారికి, తమకు మధ్య ఎన్నికలుగా చెప్పానని ఆయన సమర్ధించుకుంటున్నారు.
ఎన్నికల ఫలితాలు వచ్చే మార్చ్ 10 తర్వాత బుల్లడోజర్స్ పంపిస్తామని అంటూ ప్రధాన ప్రతిపక్షంపై చేసిన వాఖ్యకు సహితం అంతగా మద్దతు లభించడం లేదు. ఒక చోట సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు బుల్డోజర్ తో ప్రదర్శన చేశారు.
ఆయన నేతృత్వంలోని హిందూ యువ వాహినికి పెద్దఎత్తున మద్దతు ఉండెడిది. 2017 ఎన్నికలలో వారు క్రియాశీల పాత్ర వహించారు. అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత దాని కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
ఆ తర్వాత మొదటిసారిగా ఫిబ్రవరి 2న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ ఎన్నికల ప్రచారానికి వారణాసి వచ్చిన సందర్భంగా హిందూ యువ వాహిని కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శన జరిపారు. ఎన్నికల సమయంలో ఇటువంటి నిరసన ప్రదర్శనలు జరపడాన్ని బిజెపి నేతలెవ్వరూ ఆమోదింపలేక పోతున్నారు.