దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. మంగళవారం పెట్రోల్‌పై 80 పైసలు, 70 పైసలు పెరిగింది. వారం రోజుల వ్యవధిలో లీటరుకి రూ. 4.80 పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.100.21, లీటర్ డీజిల్ ధర రూ. 91.47కి చేరింది.
ముంబయిలో పెట్రోల్ లీటరు ధర రూ. 115.04లకు పెరిగింది. డీజిల్ లీటరు ధర రూ. 99.25గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు 76 పైసలు పెరిగి ఇప్పుడు రూ.105.94 అయింది. డీజిల్ ధర లీటరు రూ.96. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.109.68, డీజిల్ ధర రూ.94.62గా ఉంది.
హైదరాబాద్ లో పెట్రోల్ 113 రూపాయల 61 పైసలు, డీజిల్ 99 రూపాయల 84 పైసలకు చేరింది. విశాఖలో పెట్రోల్ 113 రూపాయల 43 పైసలు, డీజిల్ 99 రూపాయల 47 పైసలకు ఎగబాకింది.గడిచిన ఎనిమిది రోజుల్లో వరుసగా ఏడుసార్లు పెరిగాయి పెట్రోల్, డీజిల్ ధరలు.
కోల్ కతాలో పెట్రోల్ 109 రూపాయల 68 పైసలు, డీజిల్ 94 రూపాయల 62 పైసలకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ 105 రూపాయల 62 పైసలు, డీజిల్ 89 రూపాయల 70 పైసలుగా ఉంది.
పెట్రో, వంటగ్యాస్ ధరల పెంపుపై ప్రతిపక్షాలు లోక్ సభలో మండిపడ్డాయి. ధరల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని, దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సభాముఖంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశాయి. సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధరి మాట్లాడుతూ. ‘మెహంగీ ముక్త్ భారత్ (అధిక ధ రల రహిత భారత్)’ కార్యక్రమాన్ని చేపట్టాలని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయించినట్లు తెలిపారు.
అలాగే ఏప్రిల్ 1 నుంచి 800 రకాల షెడ్యూ ల్ ఔషధాల ధరలను కూడా పెంచాలని నిర్ణయించడం సామాన్యులపై మరో దాడి అని విమర్శించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్లే ధరలు పెరుగుతున్నాయడం అబద్ధమని చౌధరి స్పష్టంచేశా రు. మనం రష్యా నుంచి కేవలం 0.5 శాతం చమురును మాత్రమే దిగుమతి చేసుకుంటున్నామని గుర్తుచేశారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ పెట్రోలుపై లీటరుకు రూ.3 తగ్గించార కానీ, కేంద్ర ప్రభుత్వం వారం రోజుల్లోనే పెట్రోలు, డీజిల్‌పై రూ.4 పెంచిందని డీఎంకే సభ్యుడు టి ఆర్ బాలు ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెట్రో ధరలను 50 శాతం మేర తగ్గిస్తామన్న ప్రధాని మోదీ.. ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. పెట్రో ధరలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని, వీటికి ఎప్పుడు అడ్డుకట్ట వేస్తారో ప్రధాని మోదీ చెప్పాలని టీఎంసీ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ డిమాండ్ చేశారు.