మొబైల్ సర్వీసెస్ విభాగంలో వినియోగదారులు రిలయన్స్ జియోకు మరోసారి షాకిచ్చారు. రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా వినియోగదారులను చేజార్చుకుంది. రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులను పోగొట్టుకోవడం వరుసగా మూడవసారి.
ఫిబ్రవరిలో ఈ సంస్థ నుండి 36.6 లక్షల మంది వినియోగదార్లు నిష్క్రమించారు. దీంతో జియో మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 40.27 కోట్లకు వచ్చి చేరింది. భారతి ఎయిర్టెల్ మాత్రం కొత్తగా 15.91 లక్షల మందిని చేర్చుకుంది.
దేశంలో టెలికం మొత్తం వినియోగదారుల సంఖ్య 2022 ఫిబ్రవరిలో 116.6 కోట్లకు చేరిందని, జనవరితో పోలిస్తే ఇది 0.29 శాతం తగ్గుదలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రారు) పేర్కొంది.
తూర్పు యుపి, జమ్ము, కాశ్మీర్, హర్యానా మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో మొబైల్ వినియోగదారులు తగ్గుముఖం పట్టారని, బ్రాడ్‌బ్యాండ్ చందాదార్లు స్వల్పంగా తగ్గి 78.34 కోట్ల నుండి 78.33 కోట్లకు చేరారని ట్రాయ్ తెలిపింది.
ఫిక్స్డ్ లైన్ చందాదార్లు క్రమంగా పెరుగుతున్నారు. వీరి సంఖ్య 2.42 కోట్ల నుంచి 2.45 కోట్లకు ఎగసింది. ప్రైవేటు కంపెనీలు కస్టమర్లను పెంచుకుంటుండగా ప్రభుత్వ సంస్థలైన బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ వెనుకబడుతున్నాయి.
ఈ విభాగంలో రిలయన్స్ జియో 2.44 లక్షలు, భారతి ఎయిర్టెల్ 91,243, వొడాఫోన్ ఐడియా 24,948, క్వాడ్రెంట్ 18,622, టాటా టెలీసర్వీసెస్ 3,772 కొత్త వినియోగదార్లను నమోదు చేశాయి. బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్లు మొత్తంగా 70 వేలకు పైగా వినియోగదారులను దూరం చేసుకున్నాయి.