ఉక్రెయిన్‌పై జరిగే యుద్ధంలో రష్యాను గెలవనిచ్చేది లేదని జి-7 దేశాలు స్పష్టం చేశాయి. కీవ్‌కు మరింతగా సైనిక, ఆర్థిక తోడ్పాటు అందించేందుకు సిద్ధమన్నాయి. రష్యా ప్రజలు సాగించిన చారిత్రక విజయాలకు సిగ్గుచేటైన రీతిలో పుతిన్ వ్యవహరిస్తున్నారని జి-7 ఆన్లైన్ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శించారు.
పైగా అంతర్జాతీయ నిబంధనలు, చట్టాలను రష్యా ఉల్లంఘిస్తున్నదని మండిపడ్డాయిరు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా జి 7 దేశాధినేతలు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆదివారం చర్చలు జరిపారు.
ఇప్పటికే 2400 కోట్ల డాలర్ల మేర ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ సమాజం నుండి సాయం అందిందని పేర్కొంది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌లు చేపట్టిన కార్యక్రమాలను సమావేశం ప్రశంసించింది. కెనడా తరపున మరో 5 కోట్ల డాలర్ల సైనిక సాయం అందుతుందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెయు తెలిపారు.
ఇదిలా వుండగా, రష్యా చమురు, గ్యాస్ దిగుమతులకు స్వస్తి పలికే ప్రణాళికలను జి 7 దేశాల నేతలు ప్రకటించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ చర్యలు వుంటాయని స్పష్టం చేశారు. మూడు రష్యా బ్రాడ్కాస్టర్లపై అమెరికా ఆంక్షలు విధించింది.
వాటిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం, అదనపు ఎగుమతి నియంత్రణనలు విధించడం, 2600 మంది రష్యా, బెలారస్ అధికారులపై వ్యక్తిగత ఆంక్షలు వంటి చర్యలు తీసుకుంది. రష్యాలో గత 15 ఏళ్లుగా సాధించిన ఆర్థిక విజయాలను తుడిచి పెట్టేలా పశ్చిమ దేశాల ఆంక్షలు వున్నాయని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటికే వెయ్యి వరకు ప్రైవేటు రంగ కంపెనీలు రష్యాను వీడాయని, 2 లక్షల మందికి పైగా రష్యన్లు, వీరిలో ఎక్కువమంది నైపుణ్యాలు గలవారే, దేశం విడిచి వెళ్లారని ఆ ప్రకటన తెలిపింది. ఇవన్నీ కలిసి రష్యాకు రాబోయే కాలంలో తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయిని పేర్కొంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ, రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా విజయం సాధించలేదని పేర్కొన్నారు. ”ఆనాడు మేం గెలిచాం, ఈనాడూ మేం గెలుస్తాం” అని భరోసా వ్యక్తం చేశారు.