ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఎక్కువగా సాగుతున్న గంజాయి స్మగ్లింగ్ పై ఇక్కడ పోలీసుల నిఘా పెరుగుతూ ఉండడంతో మహిళలను వినియోగించడం ద్వారా వారి కళ్ళు కప్పే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడైనది.
ఇద్దరు మహిళలకు ఎక్కువ కమీషన్ ఇస్తామని ఆశ చూపి స్మగ్లింగ్‌లో భాగస్వాములను చేయగా ఒక కారులోంచి మరో కారులోకి మారుస్తుండగా పక్కా సమాచారం ఉండటంతో దాడి చేసిన పోలీసులు పట్టుకున్నారు. మహిళలు పాల్గొనడం మొదటిసారిగా చూసి వారు నివ్వెర పోయారు.
పెద్దఅంబర్‌పేట అవుటర్‌రింగ్‌రోడ్డు పై హయత్‌నగర్ పోలీసులు ఏకంగా 470 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉండటం గమనార్హం. వాహనాల్లో మహిళలుంటే పెద్దగా తనిఖీ చేయరనే నమ్మకంతో స్మగ్లర్లు మహిళలను భాగస్వాములను చేశారు. ఎక్కువ కమీషన్ ఆశచూపి మహిళలను భాగస్వాములను చేశారు.
తూర్పుగోదావరి జిల్లానుండి కార్లలో 470కిలోల గంజాయిని కార్లలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పక్కా సమాచారంలో హయత్‌నగర్ పోలీసులు పెద్దఅంబర్‌పేట వద్ద కార్లనుండి మరో కార్లలోకి గంజాయిని మార్చుతుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌నుండి వివిధ ప్రాంతాలనుండి గంజాయిని తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు తరలించడం చాలా రోజులుగా కొనసాగుతున్నా ఇటీవలి కాలంలో వ్యాపారం పెరిగిపోయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు పెరిగిపోవడంతో అడ్డంగా దొరికిపోతున్నారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధుల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నారు. ఈ జంట కమిషనరేట్ల పరిధిలో పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోగంజాయి సరఫరా కొనసాగుతోంది. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు గంజాయి సరఫరాలో భాగస్వాములవుతున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో గంజాయికు విద్యార్థులు పట్టుబడ్డారు. గంజాయికి విద్యార్థులు, యువకులు బానిసలుగా మారడంతో ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపింది.
పెద్దఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో తనిఖీలు చేసి సాగు చేసే వారిపై కేసులు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లాలోని ఎక్సైజ్ పోలీసులు సాగు చేస్తున్న వారిపై కేసులు కూడా నమోదు చేశారు. గంజాయి సాగు చేస్తే పెద్ద ఎత్తున కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గింది. అంతర పంటగా గ్రామీణ ప్రాంతాల్లో కొందరు గంజాయి సాగు చేసే వాళ్లు.