బిజెపియేతర పార్టీలు కూడా హిందువులలో తమ మద్దతును పెంచుకోవాలని చూస్తున్న తరుణంలో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కర్నాటక యూనిట్ మతపరమైన విభజన కనిపిస్తున్న కోస్తా కర్ణాటకలో ముస్లిం సదస్సుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని అగ్రశ్రేణి మేధావుల్లో కొందరు వక్తలుగా పాల్గొనే ఈ కార్యక్రమం మే చివరి వారాంతంలో మంగళూరులో జరగాల్సి ఉంది.
వివిధ జిల్లాల నుంచి ఎంపికైన దాదాపు 2 వేల మంది ముస్లిం ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. సాంప్రదాయకంగా కార్మిక, ఆర్థిక విధాన సమస్యల చుట్టూ సదస్సులు నిర్వహించే పార్టీకి ఇదో కొత్త రకమైన రాజకీయం. బహుశా సిపిఎం చరిత్రలో ఇటువంటి సదస్సు ఎక్కడా జరిపి ఉండదు.
ఎన్నికలలో పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నా లక్షలాది మంది కార్మికులు, కర్షకులు సమీకరించడంలో దిట్టగా సిపిఎం దేశంలో పలు ప్రాంతాలలో గుర్తింపు మోపఁడుతున్నది. గిరిజనులు, దళితులు, మహిళలు, మైనారిటీల సమస్యలపై ఎంతగా మాట్లాడినా ఆ పార్టీ నాయకత్వం అగ్రవర్ణాలకే పరిమితమైనది. సిపిఎం చరిత్రలో మొదటిసారిగా ఆ పార్టీ పొలిట్ బ్యూరోలో ఈ మధ్యనే ఓ దళితుడిని స్థానం దక్కింది.
మంగళూరులో నిర్వహింపనున్న ముస్లిం సదస్సు ప్రధాన నిర్వయకుడైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మునీర్ కాటిపల్లా పార్టీ ధోరణిలో వస్తున్న మార్పుకు తానే ఉదాహరణ అని చెబుతున్నారు. కులం, లింగం, మతపరమైన గుర్తింపు ప్రశ్నలకు పార్టీ కట్టుబడి ఉందని, అదే సమయంలో గుర్తింపు ఆధారంగా మాత్రమే ప్రజల ఉద్యమాలను నిర్మించడంలో జాగ్రత్తగా ఉండాలని అతను నొక్కి చెప్పాడు. సారాంశాలు:
సీపీఎం విషయానికి వస్తే, ముస్లింలలో నాయకత్వాన్ని సృష్టించడంలో పార్టీ వైఫల్యాలను అంగీకరిస్తూనే తమ విధానం ఎల్లప్పుడూ నిజమైన కార్మిక వర్గ నేపథ్యాల నుండి నాయకులను నిర్మించడం పట్లనే ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే ముస్లిం నాయకులను నిర్మించాలనుకుంటున్నామని చెప్పారు.
బంట్ లేదా బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి అన్ని వర్గాలకు నాయకత్వం వహించగలిగితే, ముస్లిం నాయకులను పార్టీల మైనారిటీ విభాగాలకు లేదా మైనారిటీ ఆధారిత పార్టీలకు ఎందుకు పరిమితం చేయాలి? అని ప్రశ్నించారు. ఇటువంటి ప్రాధమిక ప్రశ్నలపై తమ పార్టీ దృష్టి సారించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అస్థిరతతో కర్ణాటకలో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయని చెబుతూ ముస్లింలను ఆర్థికంగా బహిష్కరించాలని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఇది మతం ఆధారంగా తీవ్రవాద భావజాలాలను ప్రోత్సహించే రాజకీయ సంస్థల వైపు తిరిగే విధంగా ముస్లిం సమాజాన్ని బలవంతం చేస్తోందని హెచ్చరించారు.
కోస్తా కర్ణాటకలో హిజాబ్ ప్రశ్నకు సంబంధించిన వివాదంలో మనం దీనిని చూశామని మునీర్ కాటిపల్లా తెలిపారు. హిందూత్వ గ్రూపులు ఈ వస్త్రానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమాన్ని ముస్లిం తీవ్రవాద గ్రూపులు సమానంగా ఎదుర్కొన్నాయని చెప్పారు. అయితే వాస్తవం ఏమిటంటే, చాలా మంది ముస్లిం బాలికలు హిజాబ్‌ను విశ్వాసంకు సంబంధించిన ప్రధానమైన అంశంగా చూడరని స్పష్టం చేశారు.
కానీ ఇప్పుడు దానిని ధరించడం హిందూ ఛాందసవాదానికి వ్యతిరేకంగా ప్రతిఘటనకు చిహ్నంగా మారిందని అంటూ హిజాబ్ ధరించని మహిళలే దీనికి నిజమైన బాధితులు అని చెప్పారు. దానికి వ్యతిరేకంగా ఉన్న ముస్లిం మహిళలు, వారు దానిని నిర్బంధంగా లేదా పితృస్వామ్యానికి చిహ్నంగా చూస్తున్నందున, ఇప్పుడు హిజాబ్‌ను పాటించాలని సామాజిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.