గృహ వినియోగదారులకు మరింత భారం కలిగించే విధంగాఎల్పిజి సబ్సిడీనిమొత్తంగా ఎత్తివేస్తున్నట్లు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కేవలం ఉజ్వల లబ్ధిదారులకు మాత్రమే ఇకపై పరిమిత సబ్సిడీ లభిస్తుందని పేర్కొంది. మిగిలిన వారందరూ తమ సిలిండర్‌కు మార్కెట్ ధర చెల్లించాల్సిందే.
ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన తొమ్మిది కోట్ల మంది మహిళలు, ఇతర లబ్ధిదారులకు మాత్రమే ఇకపై ఈ సబ్సిడీ అందనుంది. చమురు కార్యదర్శి పంకజ్ జైన్ ప్రకటించారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఎల్పిజి వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వడం లేదని, ఇకపై ఉజ్వల లబ్ధిదారులకే ప్రస్తుతమిస్తున్న సబ్సిడీ కొనసాగుతుందని చెప్పారు.
దేశవ్యాప్తంగా 30.5 కోట్ల ఎల్పిజి కనెక్షన్లు వుండగా, అందులో తొమ్మిది కోట్ల వరకు ఉజ్వల లబ్ధిదారులు వున్నారు. అంటే మిగిలిన 21 కోట్ల మందికీ సబ్సిడీ లేకుండా పోయింది.
2020 జూన్ నుండి వంట గ్యాస్‌పై సబ్సిడీని కేంద్రం చెల్లించడం లేదని, మార్చి 21న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సబ్సిడీ మాత్రమే అందజేయబడుతోందనిమీడియా సమావేశంలో పంకజ్ జైన్ పేర్కొన్నారు.
పెట్రోల్‌పై లీటరు కురూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉజ్వల లబ్ధిదారులకు సిలిండరుకు రూ.200 చొప్పున సబ్సిడీ లభిస్తుందని ప్రకటించారు. అది కూడా ఏడాదిలో 12 సిలిండర్లకే వర్తిస్తుందని చెప్పారు.
రికార్డు స్థాయిలో వంట గ్యాస్ రేట్లు పెరగడం వల్ల తలెత్తిన భారం కొంతైనా తగ్గడానికి ఇది ఉపకరిస్తుందని చెప్పారు. అదే పత్రికా సమావేశంలో చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ‘సబ్సిడీల నిర్వచనం ప్రకారం, అవి పెరుగుతూ పోవడానికి, స్థిరపడేందుకు ఉద్దేశించబడ లేదు. సబ్సిడీలనేవి ఎప్పుడూ తగ్గుముఖం పడుతూనే వుండాలి’ అని స్పష్టం చేశారు.
ఎల్పిజి సిలిండర్ ధర దేశమంతటా వెయ్యి రూపాయల పైనే ఉంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులు పొందే రూ.200 సబ్సిడీ నేరుగా వారి బ్యాంక్‌ఖాతాలో పడుతుంది. మిగిలిన వారందరూ మార్కెట్ రేటును చెల్లించాల్సిందే.
2019లో పెట్రోలుపై సబ్సిడీని అప్పటి యుపిఎ ప్రభుత్వం ఎత్తివేయగా, 2014 నవంబరులో డీజిల్‌పై సబ్సిడీని మోడీ ప్రభుత్వం ఎత్తివేసింది. 2016లో మోడీ సర్కారు కిరోసిన్‌పై ఇస్తున్న సబ్సిడీని నిలిపివేయగా, తాజాగా గ్యాస్‌పై సబ్సిడీకి మంగళం పాడింది.