2035లో భారత్‌లో పట్టణ జనాభా 67.5 కోట్లు(675 మిలియన్లు)గా ఉంటుందని వంద కోట్ల జనాభాతో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంటుందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో పేర్కొంది. అంతేకాదు కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పట్టణ జనాభా తిరిగి మామూలు స్థాయిలో పెరుగుతోందని, 2050 నాటికి మరో 220కోట్లు (2.2 బిలియన్లు) పెరగనుందని కూడా ఆ నివేదిక అంచనా వేసింది.
కరోనా మహమ్మారి కారణంగా శరవేగంగా పట్టణీకరణ తాత్కాలికంగా మాత్రమే ఆలస్యమైందని ‘ఐక్యరాజ్య సమితి హ్యాబిటట్స్’కు చెందిన ప్రపంచ నగరాల నివేదిక 2022 పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పట్టణ జనాభా పెరుగుదల తిరిగి గతంలోలాగే వేగంగా పెరుగుతోందని 2050 నాటికి మరో 220కోట్లు పెరుగుతుందని ఆ నివేదిక అంచనా వేసింది. 2035 నాటికి భారత పట్టణ జనాభా 67,54,56,000కు చేరుకోవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది.
2020లో దేశంలో పట్టణ జనాభా 48,30,99,000 ఉండగా, 2025 నాటికి అది 54,27,43,000కు, 2030నాటికి 60,73,42,000కు చేరుకుంటుందని ఆ నివేదిక అంచనా వేసింది. 2035 నాటికి భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి శాతం మొత్తం జనాభాలో 43.2 శాతంగా ఉంటుందని కూడా ఆ నివేదిక అంచనా వేసింది.
కాగా 2035 నాటికి చైనా పట్టణ జనాభా 1000 కోట్లకు పైగా(1.05 బిలియన్లు) ఉంటుందని, ఆసియాలో పట్టణ జనాభా దాదాపు మూడు వందల కోట్లకు (2.99 బిలియన్లు) చేరనున్నది. దక్షిణాసియాలోనే ఈ సంఖ్య 98,75,92,000గా ఉంటుంది. జనన రేట్లు పెరగటంతోనే పట్టణ జనాభా అధికమవుతున్నది. తక్కువ ఆదాయ దేశాల్లో పట్టణ జనాభా 2021లో 56 శాతంగా ఉన్నది. అది 2050 నాటికి 68 శాతానికి పెరగనున్నది.
పట్టణీకరణ 21 శతాబ్దపు మెగాట్రెండ్గా ఉంటుందని నివేదికను ప్రవేశపెట్టిన యూఎన్ అండర్ సెక్రెటరీ జనరల్, యూఎన్ హెబిటేట్ ఎగ్జిక్యుటీవ్ డైరెక్టర్ మైమునాV్‌ా మహ్మద్ షరీఫ్ అన్నారు. పట్టణ పేదరికం, అసమానతలు నగరాలు ఎదుర్కొంటున్న అత్యంత అపరిష్కృతమైన, సంక్లిష్టమైన సమస్యలలో ఒకటిగా ఉన్నాయని నివేదిక వివరించింది.