పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా విద్యుత్ వాహనాలను మరింత ప్రొత్సహించేందుకు జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దినదినాభివృద్ధి చెందుతున్న నగరంలో రోడ్ల అభివృద్దికి ప్రాధాన్యతనివ్వడం సిగ్నల్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో వాహన సంఖ్య పెరగడంతో వాహన కాలుష్యం అంతే పెరిగింది.
వాహన కాలుష్యం, చమురు వినియోగాన్ని తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల ఖరీదు ఎక్కువైనా పెరుగుతున్న ఇంధన ధరల వలన ప్రజలు మక్కువ కనబరుస్తున్నారు. దానికి తోడు ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల వలన కూడా విద్యుత్ వాహనాల వాడకం పెరుగుతున్నది.
దేశంలో 2030 నాటికి అన్ని రకాల ఈ -వెహికిల్స్ రెండు, మూడు చక్రాల వాహనాలు, బస్సులు, కార్లు ఎక్కువ శాతం వినియోగానికి తీసుకొని రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక విధానాలు రూపొందించి విద్యుత్ వాహనాల కంపెనీల ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి చేసున్నది. ఇందుకు సంబంధించి ఈ – వాహనాల పాలసీనీ కూడా విడుదల చేశారు.
ఈ పాలసీ లో స్టీరింగ్ కమిటీ తో పాటు ఐటి శాఖ ఎలక్ట్రానిక్ వింగ్, రవాణా శాఖ, టియస్ రెడ్ కో, టిఎస్ఎస్పిడిసిఎల్, టిఎస్ ఎన్పిడిసిఎల్, ఎంఎయుడి, టిఎస్ ఆర్టీసీ తదితర శాఖలు స్టేక్ హోల్డర్ గా వ్యవహరించ నున్నాయి.
అయా శాఖలు ఈ -వెహికిల్ పాలసీ ఆపరేషన్ గైడ్ లైన్స్, సబ్సిడీ, పబ్లిక్ ఛార్జింగ్ వసతులు, సీలింగ్ కాస్ట్, ఎలక్ట్రిసిటీ టారిఫ్, అర్బన్ ఏరియాలో పబ్లిక్ ఛార్జింగ్ ఏర్పాట్లు, అర్ టి సి లో ఛార్జింగ్ ఏర్పాట్లకు కావలసిన వసతులు ఆయా శాఖలు చేయవల్సిన అంశాలను ఈ పాలసీ లో నిర్దేశించారు.
ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల పాలసీకి రాష్ట్ర నోడల్ ఏజెన్సీ అయిన తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్(టిఎస్ఆర్ఈడిసిఓ) నగరంలో పలు చోట్ల విద్యుత్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ ఏర్పాటుకు జిహెచ్ఎంసితో ఒప్పందం చేసుకోనుంది.
వాహన ప్రవాహం ఎక్కువగా ఉన్న కారిడార్ లో, జాతీయ, రాష్ట్ర రహదారులకు సమీపంలో ఏర్పాటుకు జిహెచ్ఎంసి లొకేషన్లను గుర్తించి టి.ఎస్ రెడ్కోకు జాబితాను ఇస్తారు. ఈ నేపథ్యంలో 230 లొకేషన్ల్లో జి హెచ్ ఏం సి ద్వారా , హెచ్ ఏం డి ఎ పరిధిలో 100 లొకేషన్ జాబితా టిఎస్రెడ్ కో కు అందజేశారు. ప్రతి లొకేషన్లో ఫాస్ట్ స్పీడ్ ఛార్జింగ్, స్లో స్పీడ్ ఛార్జింగ్ సెంటర్లు ఉంటాయి.
సాధ్యఅసాధ్యాలను బట్టి యుద్ద ప్రాతిపదికన పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఇంధన సంస్థలు కూడా వారి వారి అనుకూలతను బట్టి ఛార్జింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకుంటారు. జిహెచ్ఎంసి పరిధిలో ఏర్పాటు చేసే పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ల వినియోగంతో పాటు తద్వారా వచ్చే ఆదాయాన్ని అంచనా వేసేందుకు ప్రయోగాత్మకంగా జి హెచ్ ఏం సి పరిధిలో 14 లొకేషన్ లో ఏర్పాటుకు టి ఎస్రెడ్ కో నిర్ణహించింది.
టిఎస్ఆర్ఈడిసిఓ పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసిన తర్వాత యూనిట్ కు 1 రూపాయి చొప్పున జిహెచ్ఎంసికి ప్రతి మూడు నెలల కొకసారి చెల్లించనున్నారు. ఇందుకు సంబంధించి జిహెచ్ఎంసితో టిఎస్ఆర్ఈడిసిఓ ఒప్పందం చేసుకోవాల్సి ఉన్నది.
ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసే ఈ -వెహికిల్ పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లు జిహెచ్ఎంసి పరిధిలో ఫాస్ట్ ఛార్జింగ్ (డిసి -001 నుంచి15 కెడబ్లూ) కెపాసిటీ గల ఒక్కొక్క సెంటర్ లో ఒకటి చొప్పున మొత్తం 14 లొకేషన్ లో ఏర్పాటు చేయనున్నారు. అదే లొకేషన్లలో లోఛార్జింగ్ గల C (122-150 కెడ్లబ్యూ ) సామర్థ్యం గలవి ఒక్కొక్క లోకేష్ లో 2 చోపున టిఎస్ రెడ్కో ఏర్పాటు చేస్తారు.
ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసే పబ్లిక్ ఛార్జింగ్ కేంద్రాలు
1. ఇందిరా పార్కు (ల్యాండ్ మార్కు పార్కింగ్ ప్లేస్), 2. కె.బి.ఆర్ పార్క్ గేట్1 ( గేట్ 1 పార్కింగ్), 3. కె.బి.ఆర్ పార్క్ గేట్ 3 (గేట్ 3 పార్కింగ్), 4. కె.బి.ఆర్ పార్క్ గేట్ 6 (గేట్ 6 పార్కింగ్ ఎన్టిఆర్క్యాన్సర్ హాస్పిటల్), 5. ట్యాంక్ బండ్ (కందుకూరి వీరేశ లింగం విగ్రహం వద్ద), 6. బషీర్ బాగ్ రోడ్డు (ఒత్రిస్ రెస్టారెంట్ ఎదురుగా), 7. గన్ ఫౌండ్రీ (మహాబూబియ గర్ల్ జూనియర్ కళాశాల),
8. మునిసిపల్ పార్కింగ్ అబిడ్స్ (జిపిఓ), 9. నానాక్ రామ్ గుడా (జిహెచ్ఎంసిస్పోర్ట్ కాంప్లెక్స్), 10. మహావీర హరి వనస్థలి నేషనల్ పార్క్(అనన్య రిసార్ట్), 11. శిల్ప రామం 2 నాగోల్ బ్రిడ్జి (మెట్రో ఆఫీస్), 12. ఉప్పల్ (మెట్రో స్టేషన్ పార్కింగ్), 13. ఓవైసీ హాస్పిటల్ (ఇన్నర్ రింగ్ రోడ్డు సంతోష్ నగర్), 14. తాజ్ త్రి స్టార్ హోటల్ (ఎస్డిరోడ్డు).