ఒక వంక తెలంగాణాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతూ, ఎన్నికల వాతావరణంలో ప్రధాన రాజకీయ పక్షాలు మునిగిపోయి ఉండగా, అధికార పక్షం టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు మాత్రం చాలా మంది విదేశీ పర్యటనలలో తీరిక లేకుండా ఉన్నారు.
రాష్ట్రం నుంచి సగం మందికి పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు విదేశీ పర్యటనలు చేస్తున్నారు.
గత నెల రోజుల వ్యవధిలో మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కేటీఆర్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని, మరికొంతమంది ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీ కవిత, పలువురు ఎంపీలు నాటా, ఆట సభలకు వెళ్లారు. అటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి కూడా అమెరికా వెళ్లి వచ్చారు.
ఒకేసారి ఇంతమంది విదేశీ పర్యటనలు చేస్తుండటం విస్మయం కలిగిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర ముఖ్యనాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి సమయంలో ప్రతి పక్షాలను కార్నర్ చేయాల్సిన మంత్రులు, ముఖ్య నేతలు మాత్రం ఫారిన్ ట్రిప్పులతో ఎంజాయ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి.ఇక చాలా మంది నేతలు వ్యక్తిగత పనుల మీద విదేశాలకు వెళితే మరికొంతమంది అధికారిక కార్యక్రమాల కోసం వెళ్లారు.