అమర్నాథ్ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఎగువన కురిసిన కుంభవృష్టికి వరద పోటెత్తి 15 మందికిపైగా చనిపోయారు. 40 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ఐటీబీపీ బృందాలతో పాటు స్థానిక పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఎయిర్ అంబులెన్సుల్లో తరలిస్తున్నారు. కుండపోతగా వాన కురుస్తున్న సమయంలో అమర్నాథ్ గుహ దగ్గర దాదాపు 12 వేల మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. వరదల్లో చనిపోయిన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. అమర్నాథ్లో చిక్కుకున్న యాత్రికులకు అన్ని విధాలుగా సాయం చేస్తున్నట్లుఅదని తెలిపారు.
దక్షిణ కాశ్మీర్‌లోని అమర్నాథ్ యాత్ర జూన్ 30న ప్రారంభమైంది. భక్తులతో అమర్నాథ్ గుహ దగ్గరి బేస్ క్యాంప్ కిక్కిరిసి ఉంది. వందలాది మంది అక్కడ టెంట్లు వేసుకుని సేద తీరుతున్నారు. శుక్రవారం సాయంత్రం 5.30 సమయంలో ఆకాశానికి చిల్లుపడినట్లుగా అమర్నాథ్ గుహ ఎగువ ప్రాంతంలో కుంభవృష్టి కురిసింది.
బేస్ క్యాంప్ దగ్గర కూడా భారీ వాన పడింది. దీంతో కొద్దిసేపట్లోనే గుహపై నుంచి, పక్క నుం చి బురద, రాళ్లతో కూడిన వరద పోటెత్తింది. టెంట్లపైకి రావడం, అందులోని వాళ్లు పదుల సంఖ్యలో కొట్టుకుపోవడం క్షణాల్లో జరిగిపోయింది. 25కు పైగా టెంట్లు, 3కమ్యూనిటీ కిచెన్లు దెబ్బతిన్నాయని స్ఫజాస్త్రి;ఐ చెప్పారు. పలు మృతదేహాలను రికవరీ చేశారు.
‘‘ఆకస్మిక వరదలకు కొన్ని లాంగర్లు (కమ్యూనిటీ కిచెన్), టెంట్లు కొట్టుకుపోయాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఎయిర్‌లిఫ్ట్ చేస్తున్నం. పరిస్థితి అదుపులోనే ఉన్నది” అని కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.
ఆకస్మిక వరదలపై జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. అమర్నాథ్లో పరిస్థితిపై సమీక్షించారు. ‘‘ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, స్థానిక బృందాలు సహాయక చర్యలు చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మా తొలి ప్రాధాన్యత” అని అమిత్ షా ట్వీట్ చేశారు.
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో యాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. శనివారం వాతావరణం అనుకూలిస్తే తిరిగి ప్రారంభించనుని పేర్కొన్నారు. జూన్ 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాగా పలు అవాంతరాల నడుమ భక్తులు తరలివస్తున్నారు.
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా కురిసిన ఏకధారకు 2 కిలోమీటర్ల మేర వరద ఒక్కసారిగా కొండపై నుంచి కిందకు పోటెత్తిందని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. పెను విషాదంగా మారే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం తగ్గడంతో ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐటిబిపి, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు లైట్ల వెలుతురులో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.