మయన్మార్ లోని సైనిక ప్రభుత్వం దేశం లోని నలుగురు రాజకీయ నేతలకు ఉరిశిక్ష అమలు చేసింది. సైనిక పాలనలో వీరందరూ హింస, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ శిక్ష విధించామని ప్రకటించింది.
ఉరిశిక్ష పడిన వారిలో అంగ్‌సాన్ సూకీ పార్టీ అయిన నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ మాజీ చట్టసభ సభ్యుడితో పాటు ముగ్గురు ప్రజాస్వామ్య కార్యకర్తలు ఉన్నారు. మాజీ ఎమ్ఎల్ఎ పోయో జియా థావ్, ప్రజాస్వామ్య ఉద్యమకారులు కో జిమ్మీ, హలా మియా అంగ్, అంగ్ తురా జా ఉరి కంబం ఎక్కారు.
గత ఏబై ఏళ్లలో మయన్మార్‌లో ఇదే మొదటి ఉరిశిక్షకావడం గమనార్హం. తన భర్తను ఉరి తీసినట్టు తనకు తెలియదని పోయో జియో థావ్ భార్య అక్కడి ప్రముఖ వార్తా పత్రికకు తెలిపారు. అంగ్‌సాన్ సూకీ పార్టీలో పోయో థావ్ కీలక నేతగా ఉండేవారు.
ఈ నలుగురికీ జూన్ లోనే మరణ శిక్ష విధిస్తూ మయన్మార్ ఆర్మీ ప్రకటించింది. ఈ నిర్ణయంపై అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది.