భారత్‌పై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొగడ్తల వర్షం కురిపించారు. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్ ను పశ్చిమ దేశాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలను ఖండిస్తూ భారత విదేశాంగ విధానంపై ప్రశంసల వర్షం కురిపించారు.
లాహోర్‌లో జరిగిన భారీ సభలో ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడుతూ రష్యా చమురు కొనుగోలు విషయమై స్లోవేకియాలో జరిగిన బ్రాటిస్లావా ఫోరమ్‌లో జూన్ 3న భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ మాట్లాడిన వీడియో క్లిప్‌ని ప్లే చేశారు.
”రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడం విషయంపై భారత్‌పై అమెరికా ఒత్తిడి పెరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధం చేసేలా రష్యాకు నిధులు చేకూరుస్తున్నారంటూ అమెరికా దాని మిత్ర దేశాలై పశ్చిమ దేశాలు పెద్దఎత్తున్న భారత్‌పై ఆరోపణలు చేశాయి” అంటూ కొనియాడారు.
పైగా, ఆ సమయంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రజలకు కావల్సినంత మేర గ్యాస్ కొంటాం అని జై శంకర్ స్పష్టం చేశారు. యూరప్ దేశాలు రష్యా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకుంటుండగా కేవలం భారత్‌నే ఎందుకు ప్రశ్నిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేశారు.
రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగడాన్ని భారత్ ఖండిస్తుందని ఇరుదేశాలు సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకునే దిశగా తమ వంతు సాయం అందిస్తామని కూడా భారత్ చెప్పిన విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. తమ ప్రజలకు అనుగుణంగా భారత్ విదేశాంగ విధానాన్ని రూపొందించిందని ఆయన భారత్ ను ప్రశంసించారు.
అమెరికా వ్యూహాత్మక మిత్రదేశమని భారత్ పేర్కొందని, కానీ పాక్.. భారత్‌లా చెప్పలేక పోయినదని, పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి నో చెప్పే ధైర్యం చేయలేకపోయిందని ఇమ్రాన్ ఖాన్ విమర్శలు కురిపించారు.