మద్యపానంను నిషేధించేందుకు లేదా వినియోగాన్ని నిరుత్సాహ పరచేందుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, మరొకొన్ని ప్రభుత్వాలు మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయాల తోనే ఆధారపడుతున్నాయి. కానీ ప్రపంచంలో సంపన్న దేశాలలో ఒక్కటైనా జపాన్ ప్రభుత్వం మద్యపానంను ప్రోత్సహించేందుకు జాతీయ స్థాయిలో పోటీలు పెడుతున్నది.
మద్యం తాగండని అంటూ ప్రభుత్వమే ప్రకటన విడుదల చేసింది. యువతను మద్యం వైపు ఏ విధంగా ఆకట్టుకోవాలి అంటూ కొన్ని చిట్కాలను సహితం సూచిస్తున్నది. కరోనా, ఇతర కారణాల వల్ల ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న జపాన్ ప్రభుత్వం మద్యం అమ్మకాలు మెరుగుపడేలా చేసి, దాని ద్వారా ఆదాయం పొందాలని చూస్తోంది.
దీనికోసం జపాన్ ప్రభుత్వం అక్కడి యువతతో సాధ్యమైనంత ఎక్కువ మద్యాన్ని తాగించాని శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే నేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ ‘సేక్ వివా’ పేరుతో జాతీయ స్థాయిలో పోటీలను ప్రారంభించింది. ఈ పోటీలో 20-39ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు పాల్గొనవచ్చని తెలిపింది.
ఈ పోటీలో పాల్గొన్న యువత యూత్‌లో మందు కొట్టే అలవాటును పెంచేందుకు ఏం చేయాలో సలహాలు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ పోటీలు సెప్టెంబర్ 9 వరకు కొనసాగుతాయని.. ఆసక్తి ఉన్న యువత ఇందులో పాల్గనవచ్చని వెల్లడించింది.
జపాన్‌లో ఇప్పుడున్న యువత తమ తల్లిదండ్రులు, పూర్వీకులతో పోల్చితే తక్కువ మద్యాన్ని సేవిస్తున్నారట. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ మందుకు దూరంగా ఉంటున్నారట. దీంతో జపాన్ ప్రభుత్వానికి మద్యంపై వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందట. దీంతో జపాన్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోయింది.
1980ల్లో మొత్తం ట్యాక్స్ రెవెన్యూల్లో కేవలం మద్యంపైనే వచ్చే ఆదాయం 5 శాతం ఉండగా.. 2011లో 3 శాతానికి పడిపోయింది. అదికాస్తా 2020లో 1.7 శాతానికి పరిమితమైంది. దీంతో ఎలాగైనా సరే యువతను మద్యం తాగేలా చేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా జపాన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మద్యం ద్వారా వచ్చిన ఆదాయంతోనే జపాన్ తన ప్రభుత్వాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది.