ఇబ్రహీంపట్నం ఘటనపై గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె సూచించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించిన నలుగురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే.
మరికొంతమంది నిమ్స్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన ఫై ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని హెచ్చరించారు. అందుకు బాధ్యత వహిస్తూ ఆరోగ్య మంత్రి టి హరీష్ రావును మంత్రివర్గం నుండి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని గవర్నర్ మండిపడ్డారు. శస్త్ర చికిత్స అనంతరం చనిపోయిన బాధితు కుటుంబాలకు అండగా ఉండాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. చికిత్స పొందుతున్న మహిళలకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు.
ఆపరేషన్ వికటించడంతో ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్న మహిళల్ని త్వరలోనే పరామర్శించనున్నట్లు తమిళిసై ప్రకటించారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 25న కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. అయితే శస్త్ర చికిత్స విఫలం కావడంతో వారిలో కొందరి పరిస్థితి సీరియస్గా మారింది.
వారిలో నలుగురు మహిళలు వివిధ హాస్పిటళ్లలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రస్తుతం 17 మంది బాధిత మహిళలకు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కొనసాగుతోంది.