చాలా ఉత్కంఠను రేకెత్తిస్తున్న బ్రిటిష్ ప్రధాన మంత్రి ఎన్నికలో విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్‌ను ఓడించి బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి అవుతారని పోల్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ పోటీ ఫలితాలను సోమవారం 11.30 జిఎంటి లేదా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది.
కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికల ఓటింగ్ శుక్రవారం ముగిసింది, లిజ్ ట్రస్ వచ్చే వారం విజేతగా పేర్కొనబడుతుందని, బోరిస్ జాన్సన్ తర్వాత యూకె తదుపరి ప్రధాన మంత్రిగా నియమితులు అవుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. విదేశాంగ కార్యదర్శి ట్రస్, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ మధ్య జరిగిన రన్-ఆఫ్ ఫలితం సోమవారం ప్రకతీస్తారు.
జాన్సన్ మరుసటి రోజు క్వీన్ రెండవ ఎలిజబెత్ కి అధికారికంగా తన రాజీనామాను సమర్పించడానికి ముందు ఈ ప్రకటన చేశారు. సుమారు రెండు లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల ఓటింగ్ ఆగస్టు ప్రారంభంలో ప్రారంభమైంది, జాన్సన్ తన ప్రభుత్వం నుండి అనేక కుంభకోణాలు, రాజీనామాల తర్వాత రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఒక నెల తర్వాత ఈ ప్రకటన వెలువడనుంది.
క్వీన్ ఎలిజబెత్ విజేతను లాంఛన ప్రాయంగా ప్రకటించనున్నారు. సాధారణంగా ఈ ప్రధాని పదవి ప్రకటనను లండన్‌లోని క్వీన్ అధికారిక రాజభవనం నుంచి వెలువరించాలి. అయితే ఇప్పుడు క్వీన్ స్కాట్లాండ్లో ఉండటంతో అక్కడి నుంచే విజేతను ప్రకటిస్తారు. బ్రిటన్‌కు కాబోయే ప్రధాని రాణిని మర్యాదపూర్వకంగా కలిసి, ఆమె ఆశీస్సులు తీసుకునే క్రమంలో సాంప్రదాయకంగా ఆమె హస్తాన్ని ముద్దాడే ప్రక్రియ ఉంటుంది.
వైదొలిగిన ప్రధాని నుంచి కొత్త ప్రధానికి బాధ్యతల అప్పగింత ఘట్టం ఇంతకు ముందటికి భిన్నంగా ఈసారి స్కాట్లాండ్లోని బల్మోరల్ క్యాజిల్‌లో జరుగుతుంది. లాంఛనం ప్రకారం ఈ కార్యక్రమం లండన్‌లోని బకింగ్‌హాం ప్యాలెస్‌లో జరగాలి. కానీ సమ్మర్ సెలవుల విడిదికి ఈసారి క్వీన్ స్కాట్లాండ్ ను ఎంచుకోవడంతో విజేతలు అక్కడికి వెళ్లుతారు.
కొత్త ప్రధాని నియామక ప్రకటన తరువాత కొత్త ప్రధాని లండన్‌కు తిరిగి వెళ్లుతారు. అక్కడ ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో మంగళవారం మధ్యాహ్నం ప్రసంగిస్తారు. మంత్రుల బృందాన్ని ప్రకటిస్తారు. కొత్త మంత్రి మండలి మరుసటి రోజు బుధవారం భేటీ అవుతుంది. ఇదే రోజు పార్లమెంట్ సమావేశం జరుగుతుంది. క్వశ్చన్ అవర్‌లో భాగంగా కొత్త ప్రధాని దేశంలోని ప్రతిపక్షం అయిన లేబర్ పార్టీ నేత కియిర్ స్టార్మెర్ నుంచి తొలి ప్రశ్నను ఎదుర్కొంటారు.
పోలింగ్‌లో 47 ఏళ్ల ట్రస్, సునక్ కంటే అధిక సభ్యుల మద్దతును పొందుతున్నారు. ఇదిలావుండగా “మన ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం, అధిక వేతనాలు, కుటుంబాలకు మరింత భద్రత, ప్రపంచ స్థాయి ప్రజా సేవలను అందించే ధైర్యమైన ప్రణాళిక నా దగ్గర ఉంది” అని ట్రస్ ఒక ప్రకటనలో తెలిపింది.