బ్రిటన్ చరిత్రలో అత్యధిక కాలం రాణిగా కొనసాగిన ఎలిజబెత్ా2 అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో సోమవారం ముగిశాయి. బ్రిటన్, యూరప్లోనిఇతర దేశాల నుంచి లక్షలాది మంది రాణి అంత్యక్రియల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బ్రిటన్ పౌరులు ఆమెకుకనీుటితో వీడ్కోలు పలికారు.
రాణి అంత్యక్రియల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా దాదాపు 500 మంది ప్రపంచ నేతలు, మొత్తంగా దాదాపు 2వేల మంది అతిథులు పాల్గొన్నారు. బకింగ్‌హం ప్యాలెస్‌లో రాజు చార్లెస్‌ను కలుసుకొని సంతాపం తెలిపారు.
అత్యంత పురాతనమైన వెస్ట్‌మినిస్టర్ అబే చర్చిలో ప్రార్థనల అనంతరం రెండు నిమిషాలపాటు అక్కడ హాజరైనవారు మౌనం పాటించారు. ఈ ఘట్టంతో బ్రిటన్ రాజుగా ఛార్లెస్ా3 పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించినట్టే. చర్చి వద్ద జాతీయ గీతాలాపనతో ఎలిజబెత్ అంత్యక్రియల ఘట్టం పూర్తయ్యింది.
దీనికంటే కొద్ది నిమిషాల ముందు ప్రార్థనలు జరిగే సమయంలో అక్కడును గంటను 96 సార్లు మోగించాడు. రాణి ఎలిజబెత్ బతికివును 96 ఏండ్లకు గుర్తుగా అన్నిసార్లు ఈ గంటను మోగించారు. వెస్ట్‌మినిస్టర్ అబే చర్చిలో ప్రార్థనలు పూర్తయిన తర్వాత, విండ్సర్ క్యాసిల్‌లో అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి భౌతిక కాయానిు తీసుకెళ్లారు.
చివరిగా సన్నిహితుల సమక్షంలో విండ్సర్ క్యాసిల్‌లో రాణి ఎలిజబెత్‌ను ఖననం చేశారు. గతేడాది కనుుమూసిన రాజు ఫిలిప్ సమాధి పక్కనే ఎలిజబెత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన వారందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె భౌతిక దేహాన్ని వుంచిన శవపేటిక వెనక వారందరూ నడిచారు. అశేష జనవాహిని అశ్రు నయనాల మధ్య రాణికి తుది వీడ్కోలు పలికారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వేలాదిమంది అతిథులు, లక్షలాది మంది బ్రిటన్ పౌరుల సమక్షంలో రాణి అంతిమయాత్ర అధికారిక లాంఛనాలతో సాగింది. చివరిసారిగా 1965లో విన్స్టన్ చర్చిల్‌కు అధికార లాంఛనాలతో ఇంత భారీ ఎత్తున అంత్యక్రియలు నిర్వహించారు. తిరిగి 57 ఏళ్ళ తర్వాత మళ్ళీ రాణి అంత్యక్రియలను ఇంత భారీ స్థాయిలో నిర్వహించారు.
వెస్ట్‌మినిస్టర్ హాల్లోనిక్యాటఫాక్పై ఉను రాణి శవపేటికను విండ్సర్ క్యాసిల్‌కు తీసుకెళ్లే కార్యక్రమం సోమవారం మొదలైంది. ఈక్రమంలో రాణి పార్థీవదేహానిు తొలుత వెస్ట్‌మినిస్టర్ అబేకుతీసుకెళ్లారు. అక్కడ దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నివాళులు అర్పించారు.