గత వారం దేశంలో గోధుమలు, బియ్యం చిల్లర, టోకు ధరలు తగ్గాయి. గోధుమ పిండి ధరలు లో స్థిరంగా ఉన్నాయి. కనీస మద్దతు ధర పెరగడంతో గత రెండు సంవత్సరాలుగా గోధుమలు, బియ్యం ధరలు ఎక్కువ లేదా తక్కువ పెరిగాయి.
ధరలు నియంత్రించడానికి 2021-22లో ఒఎంఎస్ఎస్ ద్వారా బహిరంగ మార్కెట్ లోకి 80 ఎల్ఎంటీ ఆహార ధాన్యాలను విడుదల చేయడంతో ధరలు తక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గోధుమలు, బియ్యంతో సహా నిత్యావసర వస్తువుల ధరలను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా నెలకొన్న అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితి కారణంగా ఆహార భయాల సేకరణ తక్కువగా ఉండడంతో ఇంతవరకు ఒఎంఎస్ఎస్ ద్వారా బహిరంగ మార్కెట్ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. అయితే, ప్రతి వారం ధరల పరిస్థితిని సమీక్షిస్తున్న కేంద్రం ధరలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉంది.
ధరలు మరింత పెరగకుండా చూడడానికి ప్రభుత్వం మార్చ్ 13 నుంచి గోధుమ ఎగుమతులు, మే 8యూ నుంచి బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ చర్యతో గోధుమ, బియ్యం ధరలు తక్షణమే నియంత్రణలోకి వచ్చాయి.
ధరలను అదుపు చేసేందుకు, సమాజంలో బలహీన వర్గాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్ యోజనని మరో మూడు నెలల పాటు అక్టోబర్ 2022 నుంచి డిసెంబర్ 2022 వరకు పొడిగించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని పేదలు, నిరుపేదలకు రాబోయే పండుగ కాలంలో ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ప్రతికూల మార్కెట్ శక్తుల నుంచి ప్రజలకు రక్షణ కలుగుతుంది.
జాతీయ ఆహార భద్రతా చట్టం, ఇతర సంక్షేమ పథకాలు, ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ ఆన్ యోజన కింద సరఫరా చేయాల్సి ఉన్న అదనపు అవసరాలకు అవసరమైన ఆహార ధాన్యాల నిల్వలు కేంద్ర పూల్లో అందుబాటులో ఉన్నాయని, ధరలు నియంత్రణలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వివరించింది.