హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు అక్టోబర్ 1 నుండి అమలు ప్రారంభించారు. ప్రధానంగా ట్రాఫిక్ సజావుగా సాగేందుకు, వాహనచోదకులకు ఎటువంటి ఆటంకంలేకుండా చూసేందుకు కొత్త నియమాలు అమల్లోఉంటాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
ఇక నుండి ట్రాఫిక్ కూడళ్ళవద్ద ఎరుపురంగు సిగ్నల్ వచ్చిన తరువాత గీత దాటితే రూ. 100 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఫ్రీ లెప్ట్ విధానంను ట్రాఫిక్ పోలీసులు గతంలోనే అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇకపై ఫ్రీలెప్ట్ కు అంతరాయం కలిగిస్తే రూ. 1000 జరిమానా విధిస్తామని స్పష్టంచేశారు.
హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు వాహనాల వినియోగం పెరుగుతోంది. దీనితో సంఖ్య పెరుగుతోంది. 30లక్షల పైచిలుకు వాహనాలు రోడ్లమీదకు వస్తున్నాయని పోలీసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొన్ని కొత్త చట్టాలను కూడా అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఆపరేషన్ రోపే పేరుతో చర్యలు చేపట్టారు.
గతంలో రోడ్డు ప్రమాధాలు నివారించేందుకు పోలీసులు ద్విచక్ర వాహదారులు తప్పకుండా తలకు హెల్మట్ దరించాలని, నాలుగు చక్రాల వాహన చోదకులు సీట్ బెల్ట్ తప్పనిసరి చేశారు. ఆ నియమాలు మొదట కాస్త ఇబ్బందిగా మారిగా ఆతర్వాత హెల్మెట్, సీట్ బెల్ట్ ప్రాముఖ్యతపై వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు.
దానితో ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరు అమలు చేస్తున్నారు. అదే విధంగా ఈ కొత్త నిబంధనల అమలుకు సహితం త్వరలో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నారు.