రిలయన్స్ జియో 5 జీ సేవలు నేటి నుండి అందుబాటులోకి రానే వచ్చాయి. అయితే, తొలిసారిగా దసరా పండుగను పురస్కరించుకొని దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో 5 జీ సేవలు ప్రయోగాత్మకంగా అందించేందుకు రిలయన్స్ జియో సిద్ధమైంది. ఈ 5 జీ సేవలను కూడా లిమిటెడ్ యూజర్లకు మాత్రమే అందిస్తుండటం విశేషం.
ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి నగరాల్లోని జియో వినియోగదారులు బుధవారం నుంచి 5జీ సేవలను యాక్సెస్ చేయనున్నట్లు రిలయన్స్ జియో సంస్థ తెలిపింది. జియో ప్రతి ఒక్క వినియోగదారుడికి ఈ 5 జీ సేవలు అందుబాటులోకి రావని పేర్కొంది. ఎంపిక చేసిన వినియోగదారులకు ‘జియో వెల్కం ఆఫర్’ అంటూ ఇన్విటేషన్ పంపించారు. ఈ 5 జీ సేవల బీటా పరీక్ష మాత్రమే కానీ వాణిజ్య ప్రయోగం కాదు. అందుకని రాండమ్‌గా ఎంపికైన వినియోగదారులకు మాత్రమే 5 జీ సేవలు అందుతాయి.
ర్యాండ్‌మెగా ఎంపికైన వినియోగదారులు ప్రస్తుతం వాడుతున్న హ్యాండ్సెట్, సిమ్‌ను మార్చాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. ప్రయోగాత్మకంగా అందిస్తున్న తొలి దశలో 1 జీబీపీఎస్ వేగంతో అన్లిమిటెడ్ 5 జీ డాటాను కస్టమర్లు పొందుతారని రిలయన్స్ జియో ధ్రువీకరించింది.
ఈ సేవలు దీపావళి నుండి మాత్రమే ఎంపిక చేసిన సీటీస్లో ప్రారంభమవుతాయి. దేశంలో నెట్వర్క్ విస్తరించడానికి కనీసం 18 నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ఈ నెట్వర్క్ని అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ తెలిపారు.
మరోవంక, ఎయిర్టెల్ ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరుతో సహా ఎనిమిది నగరాల్లో 5జి సేవలను ప్రారంభించినట్లు తెలిపింది.అయితే, దీని లభ్యత పరిమితంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది వినియోగదారులకు ఎప్పుడు చేరుతుందనే దాని గురించి పెద్దగా సమాచారం లేదు. కంపెనీ యొక్క 5G సేవలు మార్చి 2023 నాటికి దేశవ్యాప్తంగా.. మార్చి 2024 నాటికి భారతదేశం అంతటా అనేక నగరాల్లో అందుబాటులోకి వస్తాయని ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు.