అమెరికాలో అపహరణకు గురైన 8 నెలల చిన్నారి (కుమార్తె) సహా నలుగురు సభ్యుల భారతీయ సిక్కు కుటుంబం హత్యకు గురైందనికాలిఫోర్నియా అధికారులు ఈ ప్రకటించారు.
ఇది భయంకరమైనదని, అర్థం లేనిదని అంటూ కంట్రీ శాంతి భద్రతల చీఫ్ వెర్న్ వార్న్ కే వ్యాఖ్యానించారు. 36 ఏళ్ల జస్ దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్, వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి దేరి, వారి సమీప బంధువు అమన్ దీప్ సింగ్ (39) ఇండియానా రోడ్డు, హచిసన్ రోడ్డు సమీపంలో నిర్జీవంగా కనిపించినట్టు తెలిపారు.
ఓ వ్యవసాయ కార్మికుడు వీరి మృత దేహాలను చూసి అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వార్న్ కే వెల్లడించారు. గత సోమవారం ఉదయం వీరంతా అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన చూసి తనకు వచ్చిన కోపాన్ని వర్ణించలేనని పోలీసు అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.
జీసస్ మాన్యుయేల్ సల్గాడో అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడినట్టు వార్న్ కె ప్రకటించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడు ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించాడు.
సీరియస్ గా ఉండడంతో అతడ్ని హాస్పిటల్ కు తరలించారు. జస్ దీప్ సింగ్ ఇటీవలే ట్రక్ రెంటింగ్ కంపెనీని ప్రారంభించాడు. అతడి కుటుంబ సభ్యులు అందరినీ అక్కడి నుంచే నిందితుడు అపహరించుకుపోయారు. ఇందుకు సంబంధించిన సిసిటివి వీడియో ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు.
మరోవంక, అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ 20 ఏండ్ల విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఇండియానాపోలిస్‌కు చెందిన భారత సంతతి విద్యార్థి వరుణ్ మనీష్ చద్దా ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ యూనివర్సిటీలో డాటాసైన్స్ చదువుతూ.. వర్సిటీ క్యాంపస్‌లోని మెక్‌కట్చియోన్ హాల్లోగల ఓ గదిలో కొరియన్ రూమ్మేట్ జీ మిన్ జిమ్మీ షాతో ఉంటున్నాడు. జిమ్మీ షా సైబర్ సెక్యూరిటీ కోర్సు చదువుతున్నాడు.
ఈ క్రమంలో చద్దా బుధవారం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. బుధవారం తెల్లవారుజామున 12.45 గంటలకు జిమ్మీ షా 911 నంబర్ ద్వారా పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహంపై పదునైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు.
