ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి ఆదివారం రెండు రాకెట్లు దూసుకొచ్చాయి. ఈ ప్రాంతంలోని అమెరికన్ ఎంబసీ లక్ష్యంగా వీటిని ప్రయోగించినట్లు భద్రతాధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఇవి కట్యూషా రాకెట్లు. మొదట వచ్చిన రాకెట్‌ను సి-రామ్ డిఫెన్స్ బ్యాటరీలు ఆకాశంలో ఉండగానే కూల్చేశాయి. ఇది అమెరికన్ ఎంబసీకి సమీపంలో పడింది. రెండోది ఓ స్క్వేర్‌లో పడటంతో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. కాగా, మూడో రాకెట్ గ్రీన్ జోన్ వెలుపల ఒక కుటుంబంపై పడడంతో నలుగురు గాయాలకు గురయ్యారు.
ఇరాక్ భద్రతా దళాలు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, బాగ్దాద్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి ఆదివారం రెండు రాకెట్లు దూసుకొచ్చాయి. గ్రీన్ జోన్లో ఉన్న అమెరికన్ ఎంబసీ లక్ష్యంగా వీటిని ప్రయోగించినట్లు అనుమానిస్తున్నారు.
ఈ రాకెట్లను ఎవరు ప్రయోగించారో ఇంకా తెలియలేదు. దీనికి తమదే బాధ్యత అని ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించుకోలేదు. ఇదిలావుండగా, అమెరికన్ దళాలు, ఆస్తులపై రాకెట్, డ్రోన్ దాడులు ఇటీవల పెరుగుతున్నాయి.
గ్రీన్ జోన్ లో వరుసగా రెండో రాత్రి రాకెట్లు ప్రయోగించారు. ఇరాక్ లో అమెరికా లక్ష్యంగా గత రెండు నెలల్లో దాడులు జరగడం ఇది 14వ సారి.
ఇరాన్ అనుకూల వర్గాలే ఈ దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అమెరికన్ దళాలు ఇరాక్ నుంచి పూర్తిగా వెళ్ళిపోవాలని ఇరాన్ అనుకూల గ్రూపులు డిమాండ్ చేస్తున్నాయి.
బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై శుక్రవారం అమెరికా డ్రోన్ దాడి ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిమ్ సులేమానీ, ఇరాక్‌లోని టాప్ మిలిటరీ ఫిగర్ అబూ మహదీ అల్-ముహందిస్లను చంపిన తర్వాత ఇరాక్, అమెరికాల మధ్య సంబంధాలు క్షీణించాయి.