డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ చిత్రం సంచలన విజయాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం అల్లు అర్జున్ను పాన్ ఇండియా స్టార్‌గా నిలిపింది. ఆ గుర్తింపుతోనే అర్జున్ న్యూయార్క్‌లో జరిగిన వార్షిక ఇండియన్ డే పరేడ్‌లో భారతదేశానికి గ్రాండ్ మార్షల్‌గా ప్రాతినిధ్యం వహించారు.
సైమాలో ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. తాజాగా ఆయనను మరో అవార్డు వరించింది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ సిఎన్ఎన్ న్యూస్ 18 నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో వినోద రంగానికి సంబంధించి ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022’ అవార్డును అల్లు అర్జున్ అందుకున్నారు.
‘పుష్ప’లో నటనకిగానూ కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ అవార్డు అందించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘భారతీయ సినిమా, భారతదేశం ఎప్పటికీ తలవంచవు. నేను ఉత్తరాది నుంచి అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇది నాకు చాలా ప్రత్యేకమైనది’ అని చెప్పారు.
కరోనా సమయంలో సేవలందించిన కోవిడ్ యోధులకు ఈ అవార్డుని అంకితం చేస్తున్నట్లు అర్జున్ తెలిపారు.