ఆగస్ట్ 1 నుండి అక్టోబర్ 29 వరకు ఒక్కోటి కోటి రూపాయిల విలువ కలిగిన పదివేల ఎలక్టోరల్ బాండ్లను ముద్రించినట్లు ఎస్బిఐ తెలిపింది. 2022 క్యాలెండర్ ఇయర్లో రూ. కోటి విలువైన పదివేల ఎలక్టోరల్ బాండ్లను ముద్రించినట్లు కన్హయ్య కుమార్ సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద అడిగిన మరో ప్రశ్నకు ఇదే సమాధానమిచ్చింది.
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలకు ముందు అక్టోబర్ 1 నుండి 10 తేదీల మధ్య ఇటీవలి విడత ఎలక్టోరల్ బాండ్లు విక్రయించినట్లు తెలిపింది. చివరిసారిగా ప్రభుత్వం 2019లో బాండ్లను ముద్రించిందని. నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్‌లో రూ. 11,400 కోట్ల విలువైన బాండ్లను ముద్రించినట్లు ఎస్బిఐ సమాధానమిచ్చింది.
ఎస్బిఐ ఆగస్ట్ 1న 2018, 2019లలో ముద్రణ వివరాలను అందించింది. ఎలక్టోరల్ బాండ్ల ముద్రణకు అయ్యే ఖర్చును ప్రభుత్వ ఖజానా భరిస్తుందా లేదా కోనుగోలు దారుడు భరిస్తారా అన్న ప్రశ్కకు ఎస్బిఐ అక్టోబర్ 29న బాండ్ల ముద్రణకు అవసరమైన స్టేషనరీని ప్రభుత్వం నుండి పొందుతామని, వాటిని ఎస్బిఐ అనుబంధ ó బ్రాంచ్‌లలో విక్రయిస్తుందని పేర్కొంది.
ఎస్బిఐ తన ఇటీవలి ప్రత్యుత్తరంలో అందించిన సమాచారాన్ని ఉటంకిస్తూ జులైలో ఒక విడత బాండ్లను విక్రయించిన తర్వాత అదే విలువ కలిగిన 5,068 బాండ్లు అమ్ముడు పోకుండా ఉన్నప్పటికీ, ప్రభుత్వం మరో కోటి రూపాయిల విలువ కలిగిన 10,000 ఎలక్టోరల్ బాండ్లను ముద్రించిందని కన్హయ్య కుమార్ పేర్కొన్నారు.
2018లో ఈ పథకం ప్రారంభమైప్పటి నుండి ప్రభుత్వం కోటి రూపాయిల విలువ కలిగిన 24,650 బాండ్లను ముద్రించినప్పటికి, 10,108 మాత్రమే విక్రయించినట్లు తెలిపారు. 2018 నుండి విక్రయించని ఎలక్టోరల్ బాండ్ల వివరాలను దశలవారీగా అందించాల్సిందిగా కోరగా, అధీకృత శాఖలు విక్రయిస్తున్నందున సమాచారం అందుబాటులో లేదని ఎస్బిఐ తెలిపిందని పేర్కొన్నారు.
ఎలక్టోరల్ బాండ్ల కోసం ఇప్పటివరకు ప్రభుత్వం రూ.1.85 కోట్లు ఖర్చు చేసిందని ఆగస్ట్ 19న, ఇండియాసెక్యూరిటీ ప్రెస్ ఆర్టిఐ కార్యకర్త, కమోడర్ లోకేష్ బాత్రాకిచ్చిన సమాధానంలో పేర్కొంది. ఇప్పటివరకు 6,64,250 ముద్రించామని పేర్కొన్నప్పటికీ, కోటి రూపాయల విలువైన పదివేల ఎలక్టోరల్ బాండ్లను వాటిలో కలిపినట్లు ఎస్బిఐ పేర్కొనలేదని కుమార్ వెల్లడించారు.