దశాబ్దాల పాటుగా అంతర్ రాష్ట్ర జల ప్రాజెక్టుగా అనేక సమస్యలకు కేంద్ర బిందువుగా రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్ డి ఎస్) మిగిలింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఏలుబడిలో ఉన్న ఆర్ డి ఎస్ ఆ రాష్ట్రం కుడికాలువ నిర్మించి నీటినితరలించుకు పోయేందుకు ప్రారంభించిన పనులు వేగం పుంజుకున్నాయే కానీ తెలంగాణ అభ్యంతరాలు అడ్డు కట్ట వేయలేక పోతున్నాయు.
కృష్ణా నదీ యాజమానం బోర్డు ఫిర్యాదులు చేసినా నిర్మాణాలను ఆంధ్ర ప్రభుత్వం ఆపక పోవడంతో తాజాగా కేంద్ర జలవనరుల శాఖకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ కుడికాలువ నిర్మించి నీటిని తరలించుకుపోతే ప్రధానంగా జోగులాంబ గద్వాల జిల్లా రైతులు మరిన్ని సమస్యల్లో చిక్కునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఆయకట్టు రైతాంగం ఆందోళనలకు సిద్ధమవు తున్నప్పటికీ ఈ ప్రాజెక్టుద్వారా ప్రయోజనం పొందుతున్న కర్నూలు జిల్లా రైతులు ప్రతిఘటించేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఆర్ డిఎస్ తూములను బాంబులతో పేల్చిన సంద ర్భాలు నేటికీ ప్రమాద సూచికలుగానే ఉండటంతో రాజ్యాంగబద్ధమైన కెఆర్ఎంబీ, సిడబ్లయూసీ, ట్రిబ్యునల్ జోక్యం చేసుకుంటే కానీ సమస్య పరిష్కా రం అయ్యే అవకాశాలున్నాయని జల నిపుణులు భావిస్తున్నారు.
బ్రిజేష్ ట్రిబ్యునల్ సమస్యను పరిష్క రించి ఆంధ్రప్రదేశ్‌కు 4 టిఎంసీ ఆంధధ్రప్రదేశ్ లో ఉన్న తెలంగాణ ఆయకట్టుకు 17 టిఎంసీలు నిర్ణయించి ప్రాజెక్టు తూములను మూసివేయాలనీ యాజమాన్యం బాద్యతలను కర్ణాటక తోపాటుగా ఆంద్రప్రదేశ్ కు అప్పగించింది. అసలు వివాదం ఇక్కడే ప్రారంభమైంది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉన్నప్పటికీ ఏపీ నీటిని తోడుకుని తెలంగాణకు మొండి చేయి చూపుతూ వస్తుందని విమర్శలు చెలరేగుతున్నాయి. ఫలితంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆర్డీఎస్ ఒక అంశంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడంతో ఆంధ్ర తెలంగాణ నీటి వాటాలు తేల్చుకోవల్సిఉండగా ఆంధ్రప్రదేశ్ నీటి వాటాలు తేల్చుకోకుండానే కుడి కాలువ నిర్మించి ఆర్డీఎస్ నుంచి భారీగా నీటిని తరలించేందుకు పనులను ప్రారంభించింది.
వరదల కాలంలో కేవలం నాలుగు టీఎంసీలను తరలించుకుపోయే హక్కున్న ఏపీ ఏకంగా ఆర్డీఎస్ నుంచి సుమారు 80 టిఎంసీల నికర జలాలను తరలించే సామర్థ్యం ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంల నిర్మాణాలు చేపట్టింది. పనులు దాదాపుగా పూర్తి కావ స్తున్నాయి. పోస్కీ, కడువూరుతో పాటుగా మరో నాలుగు ఎత్తి పోతల పథకాల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణా లను నిలిపి వేయాలని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీ కి ఫిర్యాదు చేసినా ఫలితం లేక పోవడంతో సెంట్రల్ వాటర్ కమి షన్ కు ఫిర్యాదు చేసేందుకు నివేదికలను రూపొందిస్తుంది.