రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనున్నది. ఈనెల 23వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై విభజన సమస్యలను పరిష్కరిస్తామని, తప్పకుండా సంసిద్ధంగా ఉండాలని కోరుతూ ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ లేఖలు రాసింది.
కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న ఈసమీక్ష వెబ్ పోర్టల్‌లో అప్డేట్ చేసిన అంశాల ఆధారంగా ఈ సమావేశాన్ని హోంశాఖ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ పోర్టల్‌లో తెలంగాణ ఎలాంటి అంశాలను అప్డేట్ చేయక పోవడంతో తెలంగాణ అధికారులు విభజన భేటీకి హాజరయ్యేది సందేహంగా మారింది.
పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాలతో సెప్టెంబరు చివర్లో కేంద్ర హోం శాఖ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్‌కుమార్ భల్లా అధ్యక్షతన ఈ సమావేశం జరుగనున్నది.
ఏపీకి ప్రత్యేకంగా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్, అమరావతి రాజధాని నిర్మాణానికి అదనంగా నిధుల, ఏడు వెనకబడిన జిల్లాలకు రూ.50 కోట్ల చొప్పున కేంద్ర గ్రాంట్ల రూపంలో ఆర్థిక సాయం, రెవెన్యూ లోటు భర్తీకి ఇచ్చే సాయం, అమరావతి నగరానికి అనుసంధానం చేసే రైల్వే ప్రాజెక్టులు తదితర అంశాలు ఎజెండాలో ఉన్నట్లుగా తెలిసింది.
రెండేళ్లలో చట్టం అమలులోకి వచ్చి పదేళ్లు పూర్తి కానున్నది. గత ఎనిమిదేళ్లు పలు సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ సమస్యలను పరిష్కరించాలని, తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 27న జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయాలపై ఏ కొలిక్కి రాలేదు. అలాగే ఈ సారి ఏపీ రాజధాని అంశాన్ని సైతం సమావేశం