తిరుపతి నుండి తిరుమల వెళ్ళే మెట్ల మార్గం దగ్గర ” గ్రామాల అభివృద్ధికై సర్పంచుల సమర శంఖారావం”* కార్యక్రమాన్ని మొదలుపెట్టి నాలుగు అడుగులు వేయగానే మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ సర్పంచుల ఛాంబర్ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వై.బి. రాజేంద్రప్రసాద్, ఇతర నాయకులను, వందలాది మంది పోలీసులు చుట్టుముట్టి బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించి వారి ఆందోళనను భగ్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మీ ముత్యాలరావుతో కలసి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించిన కార్యక్రమాన్ని అడ్డగించి అరెస్లు చేశారు. సర్పంచుల నిధులు ,విధులు, అధికారాల సాధన కోసం, మరియు కేంద్ర ప్రభుత్వం 14 ,15వ ఆర్థిక సంఘం ద్వారా 12918 గ్రామాల సర్పంచులకు పంపిన రూ,,8660 కోట్లమీ తిరిగి సర్పంచుల ఖాతాల్లో జమ చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అదే విధంగా, గ్రామ సచివాలయాలను సర్పంచుల అధ్వర్యంలోకి తీసుకురావాలని. సర్పంచులకు , ఎంపీటీసీ లకు రూ:15 వేలు; అలాగే ఎంపీపీ లకు, జడ్పిటిసి లకు రూ,,30000 వేలు గౌరవ వేతనం ఇవ్వాలనిని, నరేగా నిధులు కూడా గతంలో మాదిరే సర్పంచులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు.
ఈ ఆందోళన కార్యక్రమాల ప్రారంభంగా మొట్ట మొదటగా కలియుగ వైకుంఠ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల సన్నిధిలో అలిపిరి మెట్ల మార్గం ప్రారంభం నుంచి తిరుమల వరకు నడక మార్గాన సర్పంచులు,నాయకులు నడిచి వెళ్లి స్వామి వారిని దర్శించు కొవాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చాలని, సర్పంచుల 12 డిమాండ్లు నెరవేర్చాలని ఆ ఏడు కొండల స్వామిని దర్శించుకొని, ప్రార్దిన్చాలని తలపెట్టారు.
ఈ కార్యక్రమం నుంచే *”గ్రామ ప్రజల అభివృద్ధికై సర్పంచుల సమర శంఖారావాన్ని”* ప్రారంభ సూచికంగా పూరించి భవిష్యత్ ఆందోళన కార్యక్రమాలకు శ్రీ వారి ఆశీస్సులతో శ్రీకారం చుట్టాలని తలపెట్టారు. అయితే స్వామి వారి ఆశీస్సులు కోసం వెళ్తున్న తమను అక్రమంగా , బలవంతంగా అరెస్టు చేయడం దారుణమని రాజేంద్రప్రసాద్, లక్ష్మీలు మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూలల నుంచి 26 జిల్లాలకు చెందిన సర్పంచులు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా వైయస్సార్పి, టిడిపి. జనసేన, బిజెపిటీ, సిపిఎం, సిపిఐ మొదలగు పార్టీలకు చెందిన సర్పంచులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. అలిపిరి నుంచి తిరుమల వరకు మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్ళి శ్రీ స్వామి వారి దర్శనం చేసుకుందాం అనుకోగా పోలీసులు అడ్డగించారు.