పురుషులతో పోలిస్తే భారతీయ మహిళలు ఇంటర్నెట్ వినియోగంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారని ఆక్స్‌ఫామ్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల్లో మూడోవంతు మంది మహిళలు మాత్రమే ఉన్నారని అధ్యయనం నివేదిక పేర్కొంది.
‘ఇండియా ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్-2022 : డిజిటల్ డివైడ్” నివేదికను ఆదివారం విడుదల చేసింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతం, భారతదేశం 40.4 శాతం లింగ బేధంతో అధ్వాన్నంగా ఉందని అధ్యయనం తెలిపింది. గ్రామీణ-పట్టణ డిజిటల్ విభజనను నివేదిక సూచిస్తున్నది.
సంవత్సరానికి 13 శాతం గణనీయమైన డిజిటల్ వృద్ధి రేటును నమోదు చేస్తున్నప్పటికీ, పట్టణం వాసులతో (67శాతంతో) పోలిస్తే.. గ్రామీణ జనాభాలో 31 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ సేవలను కలిగి ఉన్నారు.
జనవరి 2018 నుంచి డిసెంబర్ 2021 వరకు నిర్వహించిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) ఇంటింటి సర్వే ప్రాథమిక డేటాను ఈ నివేదిక విశ్లేషించింది. అత్యధికంగా ఇంటర్నెట్ను వ్యాప్తిని కలిగి ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ ప్లేస్‌లో ఉండగా, గోవా, కేరళ తర్వాత బిహార్ అత్యల్పంగా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయని నివేదిక పేర్కొంది.
ఎన్ఎస్ఎస్ (2017-18) ప్రకారం ఏదైనా కోర్సుల్లో చేరిన విద్యార్థుల్లో కేవలం తొమ్మిది శాతం మాత్రమే ఇంటర్నెట్తోపాటు కంప్యూటర్ను కలిగి ఉన్నారు. ‘25శాతం మంది మాత్రమే ఎలక్ట్రానిక్ డివైజెస్‌తో ఇంటర్నెట్ను వినియోగించగలుగుతున్నారు’ అని నివేదిక తెలిపింది.
మరో వైపు కరోనా మహమ్మారి తర్వాత డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగాయని, 2021లో 48.6 బిలియన్ల రిలియల్ టైమ్ డిజిటల్ ట్రాన్సక్షన్స్ జరిగాయని పేర్కొంది. గ్రామీణ భారతదేశంలో ఆర్థిక సేవలను వినియోగించే ఆర్థిక సేవలను ఉపయోగించే ధోరణి ఎస్టీ కుటుంబాల్లో తక్కువగా ఉందని, ఆ తర్వాత ఎస్సీ, ఓబీసీ కుటుంబాలున్నాయి.