ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ లో అర్జెంటీనా, ఫ్రాన్స్ నువ్వానేనా అనుట్టుగా తలపడగా చివరకు అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. తొలుత ఇరుజట్లు సమానంగా 2-2 స్కోర్ సాధించడంతో మ్యాచ్‌ను అదనపు సమయానికి పొడిగించారు . అదనపు సమయంలోనూ రెండు జట్లు 1-1 గోల్స్ చూసి మ్యాచ్‌ను 3-3తో సమం చేశాయి.
దీంతో పెనాల్టీ షూటవుట్ అనివార్యమైంది. పెనాల్టీ షూట్వుట్ కూడా అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. తొలుత ఫ్రాన్స్ ఆటగాడు ఎంబపే తొలిగోల్ సాధించి ఆ జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఆ తరువాత బంతినిఅర్జెంటీనా కెప్టెన్ మెస్సీ గోల్ గా మలచడంతో రెండు జట్టు మళ్లీ సమానంగా నిలిచాయి.
ఆ తరువాత ఫ్రాన్స్ ఆటగాళ్లు విఫలం కావడం రిజర్వు బెంచ్ నుండి వచ్చిన ఆటగాడు పౌలో డోబెల్లా గోల్ చేయడంతో అర్జెంటీనా జట్టు పెనాల్టీ షూటవుట్‌లో 2-1 ఆధిక్యానికి దూసుకెళ్లింది. ఆ తరువాత పెరడెస్ చేసిన గోల్‌తో 3-1 ఆధిక్యానికి అర్జెంటీనా జట్టు దూసుకెళ్లింది.
ఈ దశలో ఫ్రాన్స్ ఆటగాడు కోలోమౌనిగోల్ చేయడంతో ఇరుజట్లు 3-2తో నిలిచాయి. చివరి నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మోంటెల్ మరో గోల్ చేయడంతో ఆ జట్టు 4-2తో ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. 1978, 1986లలో కూడా అర్జెంటీనా జట్టు ఫిఫా కప్పును గెలిచింది.
మ్యాచ్ తొలిదశలో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పైచేయి సాధించింది. దూకుడుగా మెస్సీ మాయాజలమే చేశాడు. దీంతో ఫస్ట్ హాఫ్ సమయంలోనే అర్జెంటీనా జట్లు ప్రత్యర్థి జట్టు గోల్‌పోస్టుపై పదేపదే దాడులు చేసింది. తొలుత మెస్సీ, ఆ తరువాత ఆంజెల్ డీ మారియా గోల్స్ చేయడంతో అర్జెంటీనా జట్టు 2-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.
దీంతో అర్జెంటీనా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే, మ్యాచ్ రెండవ అర్ధభాగంలో ఫ్రాన్స్ యువ ఆటగాడు ఎంబపే వరుసగా రెండు గోల్స్ సాధించి, మ్యాచ్‌ను సమం చేశారు. దీంతో అదనపు సమయంలో ఆట సాగాల్సివచ్చింది.
అర్జెంటీనాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టాడు. ఫ్రాన్స్ చేసిన మూడు గోల్స్‌ను ఎంబాపే సాధించడం విశేషం. ఆట 80, 81, 117 నిమిషాల్లో ఎంబాపే గోల్స్ సాధించాడు. దీంతో అర్జెంటీనాకుఫ్రాన్స్ గట్టి పోటీ ఇచ్చింది. ఎంబాపే పోరాటంతోనే మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ వరకూ వెళ్లింది.
2018 ప్రపంచకప్‌లో గోల్ కొట్టి ఫ్రాన్స్‌ను విశ్వ విజేతగా నిలిపి ఎంబాపే ఈ ప్రపంచకప్‌లోనూ అదే రిపీట్ చేస్తాడనిఅందరూ ఆశించారు. అయితే తృటిలో ఇది మిస్సయింది. అయితే ఆదివారం మూడు గోల్స్‌తో ఈ ప్రపంచకప్‌లో మొత్తంగా ఎనిమిది గోల్స్ చేసిన ఎంబాపే గోల్డెన్ బూట్ అందుకునాుడు.