కరోనాపై పోరు సల్పేందుకు హెటెరో సంస్థ అభివృద్ధి పరిచిన ఔషధం నిర్మాకామ్ జనరిక్ వెర్షన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) సిఫార్సు (ప్రిక్వాలిఫికేషన్ ఆఫ్ మెడినిస్స్ ప్రోగ్రామ్) లభించింది. ఈ విషయాన్ని హెటెరో సంస్థ వెల్లడించింది. నిర్మాట్రెల్విర్ 150 ఎంజి (రెండు ట్యాబెట్లు), రిటోనావిర్ 100 ఎంజి (ఒక ట్యాబ్లెట్) కలిపి నిర్మాకామ్ అనే కాంబో ప్యాక్‌ను హెటెరో ప్రారంభించింది.
ఈ కాంబో ప్యాక్‌నే డబ్ల్యూహెచ్ఓ సిఫార్సు చేసింది. ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉన్న కరోనా రోగులకు అంటే వ్యాక్సినేషన్ పొందని, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న కరోనా రోగులకు దీనిని ఇవ్వవచ్చు అని డబ్ల్యూహెచ్ఓ బలంగా సిఫార్సు చేసినట్లు హెటెరో ఒక ప్రకటనలో తెలిపింది.
కరోనానిర్థారణ అయిన తరువాత వీలైనంత త్వరగా లేదా కరోనా వ్యాధి లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోపు ప్రిస్క్రిప్షన్ ప్రకారమే ఈ మందును వాడాలని హెటెరో తెలిపింది. దేశంలోని అన్ని హెటెరో ప్లాంట్లలోనూ ఈ నిర్మాకామ్ తయారువుతోంది. కాగా, ఈ ఔషధాన్ని తయారు చేయడానికి, మార్కెట్ చేయడానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఇప్పటికే అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది.