గోదావరి నదిలో నీటి లభ్యతపైన సర్వే చే యాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చేసిన విజ్ఞప్తులను కేంద్ర జల సంఘం (సిడబ్లుసి)లోని హైడ్రాలజీ విభాగం డైరెక్టర్ నిత్యానందరాయ్ తెలుగు రాష్ట్రాల డిమాండ్లను తోసిపుచ్చారు. ఈ మేరకు మంగళవారం జరిగిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జి.ఆర్.ఎం.బి) సమావేశంలో న్యూఢిల్లీ నుంచి వర్చువల్‌గా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నిత్యానందరాయ్ నీటి లభ్యతపై సర్వేకు నిర్దంధ్వంగా తిరస్కరించారు.
గోదావరి నదిలో ఎంత నీరుందనే అంశాలపై గతంలోనే స ర్వేలు చేశామని, ఆ మేరకు భాగస్వామ్య రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేయడం జరిగిందని, ఇప్పుడు మళ్ళీ రీ సర్వే చేయడమంటే భాగస్వామ్య రాష్ట్రాలతో తమకు (కేంద్రానికి) ఇబ్బందులు వస్తాయని, అందుచేతనే తమ పరిధిలో నిర్ణయం తీ సుకొని సర్వే చేయడం కుదరదని సి.డబ్లు.సి. హై డ్రాలజి డైరెక్టర్ కరాఖండిగా చెప్పినట్లుగా తెలిసిం ది.
అంతేగాక ఒకవేళ గోదావరి నదిలోని నీటి ల భ్యతపై తప్పకుండా రీ సర్వే చేయించాలని మీరు (తెలుగు రాష్ట్రాల అధికారులు) గట్టిగా భావిస్తే కేంద్ర జల సంఘం చైర్మన్‌కు ప్రత్యేకంగా లేఖ రా సుకోండని సూచించారు.
కాగా,తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్మించతలపెట్టిన మోదికుంటవాగు, ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన గూడెం లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఆ రాష్ట్ర ఇంజనీర్-ఇన్-చీఫ్ నారాయణరెడ్డిలు అనడంతో తెలంగాణ అధికారులు కూడా గట్టిగానే జవాబిచ్చినట్లు తెలిసింది.
తమకు కేటాయించిన నీటిలో నుంచే ఈ రెండు ప్రాజెక్టులను నిర్మించుకొంటున్నామని, ఈ ప్రాజెక్టుల మూలంగా ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి నష్టం ఉండదని కూడా తెలంగాణ అధికారులు బోర్డుకు వివరించారు. ప్రాజెక్టుల వివరాలు, తగిన సమాచారాన్ని బోర్డుకు ఇంతకు ముందే అందజేశామని, అంతకు మించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ సి.మురళీధర్ తెగేసి చెప్పారని తెలిసింది.
ఈ రెండు చిన్న ప్రాజెక్టుల మూలంగా ఎపికి నీరు అందకుండా పోతుందని ఆ రాష్ట్ర అధికారులు చేసిన వాదనలో పసలేదని కొట్టిపారవేసారు. ప్రతి ఏటా గోదావరి నది నుంచి సగటున 2,800 టిఎంసిల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, గత వానాకాలం సీజన్లోనైతే ఏకంగా 7,900 టిఎంసిల రికార్డుస్థాయిలో గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిశాయని, ఏపీ ప్రభుత్వానికి చేతనైతే ఆ నీటిని మొత్తాన్నీ వాడుకోవాల్సింది కదా… ఎందుకు వదిలేశారు? అని తెలంగాణ ఇంజనీరింగ్ అధికారులు ధ్వజమెత్తారు.