బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కి అరుదైన గౌరవం సౌదీలో లభించింది. ఫుట్ బాల్ లెజెండ్స్ మెస్సి రోనాల్డో నెయిమర్ వంటి స్టార్స్ అందరూ కలిసి ఆడుగుతున్న ఫ్రెండ్లీ మ్యాచ్ లోప్రారంభించే అవకాశం లభించింది. రియాద్ లో జరగనున్న మ్యాచ్ కి గెస్ట్ గా వెళ్లి ఆటగాళ్ళు అందరికి కరచాలనం చేసి గేమ్ ని స్టార్ట్ చేశారు.
దీనికి సంబందించిన వీడియోని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోని కేవలం 4 గంటల్లో 22 లక్షలకి పైగా నెటిజన్లు వీక్షించడం విశేషం.దీనిని బట్టి అమితాబచ్చన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఈ వీడియోని షేర్ చేయడంతో పాటు ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాళ్ళతో కలిసి మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని అమితాబచ్చన్ తన ఆనందాన్ని పంచుకున్నారు.
ఇదిలా ఉంటే అమితాబచ్చన్ వారందరికీ కలిసి దిగిన ఫోటోని కూడా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ఇక అమితాబచ్చన్ షేర్ చేసిన వీడియోపై విరాట్ కోహ్లితో పాటు టాలీవుడ్ సెలబ్రిటీ ప్రముఖులు కూడా రెస్పాండ్ కావడం విశేషం.