మహిళల, పురుషుల టీ20 జట్లను ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2022 సంత్సరానికి గానూ 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. మహిళా జట్టులో భారత జట్టు నుంచి ఏకంగా నలుగురు క్రికెటర్లు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. స్మృతి మంధాన, రీచా ఘోష్, దీప్తి శర్మ, రేణుకా సింగ్ ఠాకూర్లు ఐసీసీ టీ20 జట్టుకు ఎంపికయ్యారు.
ఆస్ట్రేలియా నుంచి తహ్లియా మెక్‌గ్రాత్, అష్ గార్డ్నర్, బేథ్ మూనేలు సెలక్ట్ అయ్యారు. నిడా దార్ (పాకిస్థాన్), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), ఇనోక రణవీర (శ్రీలంక) కూడా ఈ జట్టులో చోటు సంపాదించారు. ఈ టీమ్‌కు న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డెవినేను కెప్టెన్‌గా, రీచా ఘోష్‌ను వికెట్ కీపర్‌గా ఐసీసీ ఎంపిక చేసింది.
కాగా, పురుషుల టీ20 జట్టులో భారత జట్టు నుంచి అత్యధికంగా ముగ్గురు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఐసీసీ టీ20 జట్టుకు ఎంపికయ్యారు. ఇంగ్లండ్ టీమ్ నుంచి జోస్ బట్లర్, ఆల్‌రౌండర్ సామ్ కరన్, పాక్ నుంచి రిజ్వాన్, హ్యారిస్ రౌఫ్‌లను సెలక్ట్ చేసింది.
ఈ లిస్టులో స్పిన్నర్ హసరంగ (శ్రీలంక), సికిందర్ రజా (జింబాబ్వే), జోష్ లిటిల్ (ఐర్లాండ్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్) ఉన్నారు. ఈ టీమ్‌కు జోస్ బట్లర్‌ను కెప్టెన్, వికెట్ కీపర్‌గా ఎంపిక చేసింది. రిజ్వాన్, బట్లర్‌లను ఓపెనింగ్ జోడీగా ప్రకటించింది.
మహిళా జట్టు: సోఫీ డెవినే (కెప్టెన్), స్మృతి మంధానా, బెథె మూనే, అష్ గార్డ్నర్, తహ్లియా మెక్‌గ్రాత్, నిడా దార్, రీచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, ఇనోక రణవీర, రేణుకా సింగ్.
పురుషుల జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), మొహమ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, సికిందర్ రజా, హార్ధిక్ పాండ్యా, సామ్ కరన్, వనిందు హసరంగ, హ్యారిస్ రౌఫ్, జోష్ లిటిల్.