హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మక 20వ అంతర్జాతీయ బయో ఆసియా సదస్సు శుక్రవారం ప్రారంభమవనుంది. నేటి నుంచి 26వ తేదీ వరకు హెచ్ఐసీసీ కన్వెన్షన్ సెంటర్లో ఈ సదస్సు జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పరిశ్రమ, విద్యాసంస్థలను(అకాడమీ)ని అనుసంధానించడమే లక్ష్యంగా బయో ఆసియా ఫోరం పనిచేస్తోంది. ఇందులో భాగంగా బయోఆసియా సదస్సులను ఈ ఫోరం నిర్వహిస్తోంది.
ప్రభుత్వం, నియంత్రణ అథారిటీలు, స్టేక్ హోల్డర్లు మధ్య సమన్వయం సాధించి హెల్త్‌కేర్ రంగ వృద్ధికి బయో ఆసియా ఫోరం దోహదపడుతోంది. ఈసారి సదస్సు అడ్వాన్సింగ్ ఫర్ వన్ : షేపింగ్ నెక్స్ట్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్‌కేర్ అనే థీమ్‌తో సదస్సు జరగనుంది. భారతదేశ లైఫ్‌సైన్సెస్ రంగంలో బయోఆసియా సదస్సుది కీలక పాత్ర వహించనుంది. ఈ సదస్సులో 100కుపైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు నోబెల్ అవార్డు గ్రహీతలు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
వేడుక ప్రారంభోత్సవంలో ఫార్మా దిగ్గజం నోవార్టిస్ సీఈవో వాస్ నరసింహన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తదితరులు పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సు నిర్వహణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవనుంది. ఈసారి బయో ఆసియా సదస్సులో అనేక దేశాలు భాగస్వామ్య హోదాలో పాల్గొననున్నాయి. జీవశాస్త్రంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బయోఆసియా సదస్సును ఒక వేదికగా వినియోగించుకోనుంది.
ఇప్పటికే ఇక్కడ ఉన్న 50 బిలియన్ డాలర్ల విలువల గల లైఫ్‌సైన్సెస్ పరిశ్రమను 1000 బిలియన్ డాలర్ల పరిశ్రమగా మార్చేందుకు ఈ సదస్సు కీలక పాత్ర పోషించనుంది. బయో ఆసియా సదస్సుల చరిత్రలో ప్రముఖ మొబైల్ ఫోన్ల కంపెనీ ఆపిల్ పాల్గొంటోంది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ రంగంలో విజయవంతమైన కంపెనీ లైఫ్‌సైన్సెస్, ఫార్మా రంగాలకు కీలక వేదికగా ఉన్న బయోఆసియా సదస్సులో పాల్గొంటుండడం విశేషం.