కేంద్ర ప్రభుత్వం 2023 – 24 బడ్జెట్ లో ప్రకటించిన ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ పతాకంకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ ను మార్చి 31 న కేంద్రం జారీ చేయడం మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మరో ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రారంభించింది. ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ పేరుతో ఈ సేవింగ్స్ పథకాన్ని ప్రారంభించింది.
మహిళలు కానీ, వారు గార్డియన్ గా బాలికలు కానీ ఈ చిన్న మొత్తాల పొదుపు పథకం కింద సేవింగ్స్ ఖాతాను ప్రారంభించవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్ట్ ఆఫీస్ ల్లో, లేదా ఆథరైజ్డ్ బ్యాంక్ శాఖల్లో ఈ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు. ఒక మహిళ తను స్వయంగా కానీ, 18 ఏళ్లు నిండని బాలికల తరఫున గార్డియన్ గా కానీ ఈ అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు.
ఈ పథకం రెండేళ్ల కాల పరిమితితో ఉంటుంది. ఇందులో 7.5% ఫిక్సడ్ వడ్డీ రేటు లభిస్తుంది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీని అసలులో జమ చేస్తారు. గరిష్టంగా రూ. 2 లక్షల వరకు ఇందులో సేవింగ్ చేసుకోవచ్చు. విడతలవారీగా డిపాజిట్ చేసుకునే అవకాశం, పాక్షిక విత్ డ్రాయల్ సదుపాయం కూడా ఉన్నాయి.
ఈ పథకంలో చేరడానికి కనీస మొత్తం రూ. 1000. ఆపై వంద రూపాయల చొప్పున పెంచుతూ, గరిష్టంగా రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకం 2025 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఖాతా ప్రారంభించి, డిపాజిట్ చేసిన తరువాత సంవత్సరం పాటు విత్ డ్రాయల్ చేసుకునే అవకాశం ఉండదు.
కానీ సంవత్సరం తర్వాత మాత్రమే పాక్షికంగా, అంటే డిపాజిట్ చేసిన మొత్తంలో 40% వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలనుకునే మహిళలకు ఇది చాలా ఉపయోగకరమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
