నాని నటించిన దసరా చిత్రానికి అంగన్ వాడీ కార్యకర్తల సెగ తగిలింది. నాని నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరా. శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు చేస్తుంది. నాని – కీర్తి సురేష్ జంటగా నూతన డైరెక్టర్ శ్రీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కింది.
కాగా ఇప్పుడు ఈ చిత్రానికి అంగన్ వాడీ కార్యకర్తల సెగ తగిలింది. ఈ సినిమాలో తమను కించపరిచే విధంగా పలు సన్నివేశాలు ఉన్నాయని అంగన్ వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించడంతోపాటు దసరా చిత్ర బృందం తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ మూవీ లో సినిమాలో కీర్తి సురేష్ వెన్నెల అనే అంగన్ వాడీ టీచర్ పాత్ర పోషించింది. ఇందులో ఒకానొక సమయంలో పిల్లల కోసం ఇవ్వాల్సిన కోడిగుడ్లను వెన్నెల అనే పాత్ర అమ్ముకుంటుంది. అంతేకాకుండా, మరికొన్ని గుడ్లను తీసుకెళ్లి తమ కుటుంబ సభ్యులకు ఇస్తుంది.
ఇప్పుడు ఈ సన్నివేశాల మీద అంగన్ వాడీ కార్యకర్తలు అభ్యంతరం తెలియజేస్తూ ధర్నాకు దిగారు. మరోపక్క ఈ మూవీ మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 26.81 కోట్లు రాబట్టింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.90కోట్లు, వేరే భాషల్లో రూ. 95 లక్షలు, నార్త్ ఇండియాలో రూ. 90 లక్షలు, ఓవర్సీస్లో రూ. 6.70 కోట్లు రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 38.26 కోట్లు షేర్, రూ. 68.45 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.